Home తెలంగాణ వంధ్యత్వం పై విస్తృత ప్రచారం అవసరం…. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

వంధ్యత్వం పై విస్తృత ప్రచారం అవసరం…. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
వంధ్యత్వం పై విస్తృత ప్రచారం అవసరం.... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • వంధ్యత్వం పై విస్తృత ప్రచారం అవసరం
  • దేశంలో 28 మిలియన్ల జంటల్లో సంతానోత్పత్తి సమస్యలు
  • ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్. సి. జ్యోతి
  • 'మ్యూజిక్ ఆఫ్ హోప్' పేరుతో ఫెర్టీ9 ట్యూన్ పరిచయం
  • ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా 'టుగెథెర్ ఇన్ ఐవీఎఫ్ ప్రచారం

హైదరాబాద్ జూలై 25 : భారతదేశంలో దాదాపు 28 మిలియన్ల జంటలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నాయని, నిశ్చల జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి స్థాయిలు, ఊబకాయం, ఇతర వైద్య పరిస్థితులు వంటి కారణాల వల్ల ఈ సంఖ్య పెరుగుతోందని ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్. సి. జ్యోతి అన్నారు. వంధ్యత్వం అనేది పిల్లలు కనలేని స్థితి. కొన్ని జంటలు ఈ సమస్య కారణంగా శారీరకంగా, మానసికంగా చాలా క్షోభని అనుభవిస్తారని అన్నారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం స్త్రీ, పురుషులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే జరుపుకుంటున్నాము. ఒకవేళ ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నా ఇద్దరికీ ఇలాంటి అవగాహన వల్ల సమస్య నుంచి బయటపడేందుకు చక్కని మార్గంగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. జంటలు ఒకరినొకరు నించుకోకుండా సమస్యను సానుకూల దృష్టితో చూసే అవకాశం, అవగాహన ఏర్పడుతుందని, చక్కటి కుటుంబం కోసం జంటలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టడమేగాక ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకుంటామని చెప్పారు. గురువారం సికింద్రాబాద్ ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్ ప్రాంగణంలో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ సి ఈ ఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీష్ తోడియా కలిసి డాక్టర్. జ్యోతి మాట్లాడారు. సంతానలేమి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డాక్టర్. జ్యోతి అన్నారు. సంతానలేమిని ఎదుర్కొంటున్న వారి పట్ల అవగాహన పెంపొందించడానికి, మద్దతును పెంచుకోవడానికి మా నిబద్ధతను సూచిస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఫెర్టీ 9 ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం కోసం ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. 2024 ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం సందర్భంగా ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్. జ్యోతి సి. బుడి మీడియానుద్దేశించి మాట్లాడుతూ ఫెర్టీ 9 ప్రారంభించిన అవగాహన ప్రచారం యొక్క లక్ష్యాలు, వంధ్యత్వం, ఐవిఎఫ్ చికిత్సలను గుర్తించడం యొక్క ప్రాముఖ్యత అన్నారు. వీధి నాటకాలు, ఇతర కార్యకలాపాల ద్వారా వంధ్యత్వం ఐవిఎఫ్ చికిత్సల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృత స్థాయి అవగాహన ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వంధ్యత్వంతో బాధపడుతున్న వారికి 'మ్యూజిక్ ఆఫ్ హాప్' పేరుతో ఫెర్టీ9 ట్యూన్ పరిచయం చేస్తున్నాం. ముఖ్యంగా సంతానోత్పత్తి చికిత్సలు చేయించుకుంటున్న జంటలకు ఆశ కల్పించేలా సంగీతాన్ని కంపోజ్ చేశారు. టుగెథెర్ ఇన్ ఐవీఎఫ్ ప్రచారం ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా లో వీధి నాటకాల ద్వారా సంతానలేమి, ఐవీఎఫ్ చికిత్సల గురించి అవగాహన పెంచడానికి రూపొందించబడింది. భారతదేశంలోని అనేక ప్రాంతాల వంధ్యత్వం అనేది సమస్యగా మారిందని, ఈ ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన ;పెంచి ఐవీఎఫ్ ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, అర్థం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం.

ధర్మి థియేటర్ అకాడమీతో భాగస్వామ్యం : ఫెర్టీ9 ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా అంతటా 16 ప్రదేశాలలో వీధి నాటకాలను ఏర్పాటు ధర్మి థియేటర్ అకాడమీతో భాగస్వామ్యులయ్యారు. రోహిత్ రాజ్ ఆకుల దర్శకత్వం వహించిన ఈ నాటకాలు, వంధ్యత్వంపై వెలుగునిచ్చేందుకు, ఐవిఎఫ్ తో సంబంధం ఉన్న కళంకాన్ని తొలగించడానికి నిజ జీవిత పరిస్థితులను వర్ణిస్తాయి. మిస్టర్ రోహిత్ మాట్లాడుతూ భాగస్వామ్యం, భావన, లక్ష్యాలు ఈ వినూత్న ప్రచారంలో ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్‌తో కలిసి క్లిష్టమైన సంభాషణలను తెరపైకి తీసుకురావడానికి వీధి నాటకాల ద్వారా ప్రజల చైతన్యవంతులను అందించారు. ధార్మి థియేటర్ అకాడమీ ద్వారా దర్శకత్వం వహించిన వీధి నాటకాలు, వంధ్యత్వంతో పోరాడుతున్న జంటలు నిజ జీవిత పరిస్థితులను వర్ణిస్తుంటాయి. ఈ ప్రదర్శనలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించడానికి రూపొందించబడ్డాయని వివరించారు.

ఫెర్టీ 9 ట్యూన్ ప్రారంభం : ఫెర్టీ 'మ్యూజిక్ ఆఫ్ హోప్'ని పరిచయం చేయడానికి ఉత్సాహంగా ఉంది. ఇది మా యాజమాన్యంలోని ఐపి ప్రచార థీమ్‌గా ఉపయోగపడుతుంది. ఇది సంతానోత్పత్తి చికిత్సలు చేయించుకుంటున్న జంటలకు ఆశ, మద్దతు సూచిస్తుంది. వంధ్యత్వంతో పోరాడుతున్న అనేక జంటల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రయాణంలో అవగాహన పెరగడానికి, ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి దోహదమవుతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech