మాస్‌బ్యాంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకటరాజేంద్ర, మనీషా జష్నాని, సుస్మిత అనాల, సాంచిరాయ్ హీరో హీరోయిన్‌లుగా లక్ష్మీగణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా హారర్ ఎంటర్‌టైనర్ 'లోపలికి రా… చెప్తా!'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫస్ట్ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. రొటీన్‌కి భిన్నంగా డెలివరీ బాయ్ అయిన జాఫర్‌తో ఈ సాంగ్‌ను విడుదల చేయించారు. సరిగమ ఆడియో కంపెనీ ఈ సినిమా ఆడియో హక్కులు దక్కించుకుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకటరాజేంద్ర మాట్లాడుతూ 'మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే మా చిత్రంలో మొదటి సాంగ్‌ను ఓ డెలివరీ బాయ్‌తో రిలీజ్ చేయించాలని నిర్ణయించాం. అలాగే సంగీత దర్శకులు డేవ్ జాండ్ (ఈగల్ ఫేమ్)సారథ్యంలో కపిల్ కపిలన్ ఈ పాట పాడారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు
కొండా వెంకటరాజేంద్ర, మనీషా జష్నాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా నటించిన ఈ చిత్రం మ్యూజిక్: డేవ్ జాండ్, డిఓపి: రేవంత్ లేవాక, అరవింద్ గణేష్, ఎడిటర్: ఆర్ వంశీ.ఓ. : బి.వీరబాబు ప్రొడ్యూసర్: లక్ష్మీగణేష్ చేదెళ్ళ, కొండా వెంకటరాజేంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా వెంకటరాజేంద్ర