30
మాజీ మంత్రులు కేటీఆర్,హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటుంది. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
పలు మార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వెయ్యగా.. కవితకు ఈ విషయం లో నిరాశే ఎదురైంది. ప్రతిసారి బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం వారికి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.