27
సిద్ధిపేట, ముద్ర ప్రతినిధి: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సొహైల్ (23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన స్నేహితుడు మహమ్మద్ ఖదీర్ తో సిద్ధిపేట నుంచి మిరి కలిసిదొడ్డి వైపునకు బైక్ పై వెళ్తుండగా రహదారి ప్రమాదానికి కారణమైంది. జూన్ 29న జరిగిన ఈ ప్రమాదంలో సొహైల్ తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి స్క్రాప్ లోడ్ తో వెళ్తున్న ఒక ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంటనే తీవ్రంగా గాయపడిన సొహైల్ ను హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. సోహైల్ అనేక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దక్షిణ భారత స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్నాడు. మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు.