- కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేయండి
- ఎంతటివారైనా చట్టరీత్యా చర్యలు తీసుకోండి
- గంజాయి విక్రయాలపై ఉక్కు పాదం మోపండి
- పోలీస్ కమిషనర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాలు
ఖమ్మం, ముద్ర : రైతుల భూములు ఆక్రమించుకుంటూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేయడం, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నేరం చేసిన ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచింపు ప్రారంభ మంత్రితో సీపీ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించిన పలు విషయాలను చర్చించారు.
తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టిస్తూ ఆక్రమణలకు గురవుతున్నా వారిపై దృష్టి సారించాలని సీపీకి సూచించారు. కొంతమంది ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారని వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గంజాయి విక్రయాలు.. వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వారిపై ఉక్కుపాదం మోపాలని సూచించింది. గంజాయి మూలంగా యువత పెడదోవ పడతాయని దీన్ని అంతమొందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పోలీస్ ఠాణాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవ్వాలని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి చెప్పారు.