Home తాజా వార్తలు రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి హామీ పనులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి హామీ పనులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి హామీ పనులు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • వచ్చే ఐదు మాసాల్లో రూ. 1372 కోట్ల నిధులతో ప్రాణాలిక
  • ఆమోద ముద్ర వేసిన మంత్రి సీతక్క

ముద్ర, తెలంగాణ బ్యూరో :- మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్‌ఐఎస్) రాష్ట్రంలో ప‌క‌డ్బండిగా అమ‌లు చేయాల‌ని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క అధికారుల‌ను జాతీయ స్థాయిలో ఉంచారు. ప్ర‌ణాళిక బ‌ద్దంగా ప‌నులు చేయించాల‌ని సూచించారు. రైతుల ఆదాయం పెంచేలా, ఉపాధి హమీ నిధులతో వ్య‌వ‌సాయ అనుబంధ ప‌నుల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌న్నారు. శాశ్వ‌తంగా నిలిచేలా ఉపాధి హ‌మీ ప‌నులు చేప‌ట్టాలన్నారు, ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని చెప్పారు.

రాష్ట్రంలో జిఎన్ఆర్ఐఎస్ అమ‌లు శుక్రవారం సచివాలన్యంలోని తన ఛాంబర్‌లో ఆమె సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాబోయే 5 నెలల కాలానికి సంబంధించి రూ. 1372 కోట్ల నిధులతో చేపట్టే పనుల ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. మహిళ‌కు ఉపాధి భ‌రోసా, పంట‌పొలాల‌కు బాట‌లు, పండ్ల తోటల పెంపకం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కింద చేప’ట్టే పనుల’ను ఫైనలైజ్ చేసారు. రూ. 106 కోట్ల నిధులతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ప్రతి నియోజకవర్గానికి సుమారు కోటి నిధులను వెచ్చించాలని నిర్ణయించారు. మొత్తం 5,400 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదాయాన్ని పెంచే దిశలో కొట్టాలు, కోళ్ళ షెడ్ల నిర్మాణం, వర్మి కొంపోస్ట్-వాన పాముల తయారీకి తోటల నిర్మాణం, ఎస్‌హెచ్‌హెచ్‌ జిల్లాలో ఉన్న రైతుల బీడు భూములను అభివృద్ధి చేసి సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిలకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.

ఇక ప్రతి నియోజక వర్గానికి రూ. రెండు కోట్లు వెచ్చించి వ్యవసాయ పొలాలకు బాటలు వేయాలని నిర్ణయించారు. దీనితో పాటు 2,700 ఎకరాలలో రూ. 16.20 కోట్ల నిధులతో చిన్న సన్నకారు రైతులకు ఉపాధి హామీ ద్వారా పండ్ల తోటలు, ఈత మొక్కల పెంపకము చేపట్టి ఆదాయాభివృద్ధిని పెంచేలా ప్రాణాళిక’లు సిద్దం చేశారు. అలాగే 9 కోట్ల మొక్కలను పెంచి, వచ్చే సంవత్సరం వ’న మహోత్సవంలో నాటడానికి సిద్ధంగా ఉంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీనితో పాటు జలనిధి కింద వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రాష్ట్రంలో రూ. 204 కోట్ల నిధులతో ప్రతి నియోజక వర్గంలో సుమారు రెండు కోట్లతో మొత్తం 11,350 నీటి నిల్వ, నీటి సంరక్షణ పనులను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో బాగంగా 540 చెక్ డ్యాములు, 540 వ్యయసాయ బావుల నిర్మాణము, వేయికి పైగా బోర్ వెల్ రీఛార్జి గుంతల నిర్మాణం వంటి ప‌నుల‌ను చేప‌డుతారు.

దీనితో పాటు ప్రతి నియోజక వర్గానికి సుమారు రూ. 5 కోట్ల నిధులతో గ్రామాలలో మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందులో బాగంగా ఇంకుడు గుంతల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణాలు, ఇంటర్నల్ సిమెంటు కాంక్రీటు రోడ్ల నిర్మాణం, వేయి కొత్త గ్రామ పంచాయతి భవనాల నిర్మాణము, 500కి పైగా అంగన్వాడీ భవనాల నిర్మాణాలను నిర్ణయించారు. దీనితో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 4960 కోట్ల నిధులతో చేపట్టే పనుల కోసం అధికారులు అంచనా వేసిన ప్రణాళికలు సిద్దం చేయగా మంత్రి సీత’క్క ఆమోదం తెలిపారు. ఈ సమీక్షలో పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి లోకేష్ కుమార్, క‌మీష‌న‌ర్ అనితా రామ‌చంద్ర‌న్, స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ ష‌ఫిఉల్లా, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ కాంతి వెస్లీ, పంచాయ‌తీ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్‌సీ క‌న‌క‌ర‌త్నం, ఇత‌ర‌త్నం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech