Home తాజా వార్తలు రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించాలి – కేటీఆర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించాలి – కేటీఆర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
హైడ్రాను నడిపిస్తున్నది రాహుల్ గాంధీనే



  • రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించాలి
  • సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం సరికాదు
  • ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
  • మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్నారు..
  • రైతు భరోసాకి, దొడ్డు వడ్ల బోనస్ కు పైసలు లేవా
  • లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడితే ఊరుకోం
  • వానాకాలం సీజన్ పూర్తవుతున్న రైతుభరోసా ఊసేలేదు
  • అవినీతి ఆలోచనలు మానేసి..రైతులకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి
  • రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం
    ,

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నికలకు ముందు రైతులు పండించే ప్రతి క్వింటాలు ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తాజాగా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షనూ దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్, ఈ వర్షా కాలానికి సంబంధించి రైతు భరోసా పైన తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. వానాకాలం సీజన్ పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా ఊసే ఎత్తటం లేదని ప్రశ్నించారు. వెంటనే దొడ్డు వడ్లకు బోనస్ తో పాటు రైతు భరోసా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా రైతులు పండించే ధాన్యం ప్రతి క్వింటాలుకు రూ. 500 అదనంగా బోనస్ ఇస్తామని ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. గత సీజన్ లో రైతులకు బోనస్ ను చెల్లించకుండా వారిని ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు దొడ్డు వడ్లకు బోనస్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవటంతో రైతులు అయోమయంలో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్షలోనైనా ఈ ప్రభుత్వం ఆశించిందని, దాని గురించి ఎలాంటి ప్రకటన చేయాలన్నారు.

కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం చూసి రైతులంతా ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు రైతులు పండించిన ధాన్యం మొత్తానికి క్వింటాకు రూ. 500 బోనస్ అంటూ మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పటం జరిగింది. దానికి అనుగుణంగా ఈ సీజన్ రైతులు పండించిన ధాన్యం మొత్తానికి క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లించాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత సీజన్ బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వమంటే అది మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడమేనని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 80 సంవత్సరాలకు పైగా రైతులు పండించేవి దొడ్డు వడ్లేనన్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు అని చెప్పారు. సన్నలు, దొడ్డు వడ్లు వాటికీ బోనస్ ఇస్తామన్న మీ మాటలు నమ్మే రైతులు కాంగ్రెస్‌ను గెలిపించారని మార్చిలో కేటీఆర్‌ సూచించారు. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ సన్నాసి నొక్కులు నొక్కటమంటే అది ముమ్మాటికీ రైతులను నిలువునా మోసం చేసే కుట్రనే అన్నారు. వెంటనే రైతులకు బోనస్ ను చెల్లించాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం తప్పదని తెలియజేసారు.

రైతు భరోసా ఊసేదీ?

వానాకాలం సీజన్ ఫూర్తయటం ఇప్పటి వరకు రైతు భరోసా సంగతి తేల్చడం లేదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ. 7500 ఇస్తామంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో మీరే మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ గత సీజన్ లో రైతులకు రైతుబంధు పైసలు మాత్రమే వేశారు. ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు అసలు రైతు భరోసా సంగతే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నాట్లు వేసే నాడు వేయాల్సిన పెట్టుబడి సాయాన్ని పంట చేతికొచ్చే వరకు కూడా ఇవ్వకపోవటమంటే రైతు పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అంటూ తహతహలాడుతున్న ముఖ్యమంత్రికి రైతులకు భరోసా ఇవ్వడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు. మూసీ పేరుతో చేసే అవినీతి ఆలోచనలను మానేసి…రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు. రైతు రాజును చేయాలన్న గట్టి సంకల్పంతో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ రైతుబంధు పేరుతో రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం లేదని కేటీఆర్ గుర్తు చేశారు.

ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. దేశ వ్యాప్తంగా రైతుబంధు పథకానికి ప్రశంసలు అందజేయడానికి కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ ఏట రూ. 10 వేలు ముష్టి వేస్తున్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 15 వేలు ఇస్తామంటూ మీరు చేసిన ప్రకటనలు విని రైతుల పెట్టుబడి సాయం పెరుగుతుందని ఆశపడ్డాం. రూ. 15 వేల సంగతేమో గానీ గతంలో ఇచ్చిన ఎకరాకు రూ. 10 వేలు కూడా దక్కని పరిస్థితి తీసుకొచ్చి రైతును గోస పెడుతున్నారు. గత సీజన్ లో కూడా రైతుబంధు విషయంలో తీవ్ర గందరగోళం సృష్టించారు. ఈ సీజన్ దాదాపు పూర్తయిపోతున్నా సరే ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తుంది. రైతు భరోసా ఇస్తారో లేదా ప్రభుత్వం నిర్ణయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత సీజన్‌లో బాకీ ఉన్న డబ్బును వెంటనే కలుపుకొని రైతుల ఖాతాలో ఈ సారి మొత్తం ఎకరాకు పది వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు కచ్చితంగా మీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కేటీఆర్ చెప్పారు.

20 లక్షల మందికి రైతులకు నయా పైసా రాలే

వందశాతం రుణమాఫీ అయ్యిందంటూ విర్రవీగిన ముఖ్యమంత్రి బండారం వ్యవసాయ మంత్రి ప్రకటనతో బట్టబయలైందని కేటీఆర్ అన్నారు. 20 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాపీ జరగలేదని వ్యవసాయ మంత్రే ప్రకటన చేశాడంటే ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని తేలిపోయింది. డిసెంబర్ 9 రోజే ఏకకాలంలో రూ. 2లక్షలు రుణమాఫీ ఇచ్చి 10 నెలలైనా 20 లక్షల మంది రైతులకు నయా పైసా రాలేదంటే రైతులను నయవంచన కాకపోతే ఏంటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారిక లెక్కల ప్రకారమే…20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటే అనధికార లెక్కల ప్రకారం ఇంకా ఎంతమంది రైతులు ఉంటారో అర్థం చేసుకున్నారు. రైతులకు చేయాల్సిన రుణమాఫీ పక్కన పెట్టి మూసీ పేరుతో వేలకోట్లు దోపిడీ చేయాలనుకుంటున్నారు ఈ రాబందుల ప్రభుత్వం రైతులకు ఏం లాభమని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోలేని శాపంగా మారింది. రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే ఊరుకునేది లేదని కేటీఆర్ అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech