పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సంధర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.ఈ సంఘటనలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేణుక అనే మహిళ మృతి చెందగా,ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం హాస్పిటల్ లో అత్యవసర చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఈ విషయం మీద డాక్టర్స్ మాట్లాడుతు ఇంకో మూడు రోజులు అయితే గాని విషయం చెప్పలేమన్నారు.
ఇప్పుడు ఈ మొత్తం విషయం మీద అల్లు అర్జున్(అల్లు అర్జున్)ని బాధ్యుడ్ని చేస్తూ,తెలంగాణాకి చెందిన పిడిఎస్ యు సంస్థతో పాటు అనేక మేధావులు అల్లుఅర్జున్ పై పోలీస్ కేసు నమోదు చేయాలని,కోరడం జరిగింది. లేదంటే పుష్ప 2 కి అడ్డుకుంటామనే హెచ్చరికని కూడా ప్రతినిధులు జారీ చేసారు..దీంతో సంధ్య థియేటర్‌ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 యూనిట్, అల్లు అర్జున్ సెక్యూరిటి వింగ్,సంధ్య థియేటర్ యజమాన్యంపై, సెక్షన్ 105, 118(1)r/w3(5 ) BNS యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.
ఇక రేణుక మరణం మీద నిన్న అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తూ తొక్కిసలాటలో రేణుక మరణించడం చాలా బాధాకరమని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటుగా హాస్పిటల్ లో ఉన్న ఆమె కుమారుడి ఖర్చులు కూడా తనే భరిస్తానని చెప్పగా,పుష్ప 2 ని నిర్మించిన మైత్రి మేకర్స్(mythri movie makers)కూడా జరిగిన ఘటన చాలా బాధాకరమని,రేణుక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పడం జరిగింది.