24
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా భాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రెహమాన్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తం చేస్తే సైరా మాత్రం తమ ప్రైవసీని గౌరవించాలని కోరడం జరిగింది.
ఇప్పుడు రీసెంట్ గా రెహమాన్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి శిష్యురాలుగా పని చేస్తున్న ఒక లేడీ కూడా తన భర్తకి విడాకులు ఇచ్చిందనే వార్తలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ వార్త నిజమనే చర్చలు కూడా జరుగుతున్నాయి.ఏది ఏమైనా రెహమాన్ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే శిష్యురాలు కూడా తన భర్తకి విడాకులు ప్రకటించడం ఇప్పుడు ఇండియన్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.