- ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి
- ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
- చివరి ఆయకట్టు వరకు సాగునీటిని విడుదల చేయాలి
- పానుగల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ముద్రణ,పానుగల్:-కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని,రుణం పొందిన ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన మాజీ ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్,మాజీ రైతుబంధు మండల కోఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు లు.సోమవారం పానుగల్ మండల విలేకరులతో మాట్లాడారు.
గ్రామాలలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిన రైతులు ఆందోళన చేస్తున్నారని,ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.రేషన్ కార్డు ప్రామాణికం కాదని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు రైతులకు హామీ ఇచ్చారని,కానీ రుణమాఫీ జాబితాలో రేషన్ కార్డు నే ప్రామాణికంగా తీసుకున్నారని అన్నారు. .ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉందని హామీ ఇచ్చారని కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ అని, రేషన్ కార్డు ప్రామాణికమని, కటౌట్ డేట్ నిర్ధారించడం, ఉద్యోగం అని, కుటుంబ కారణాలను చూపుతూ కొర్రు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరిని మోసం చేసిందని వారు అన్నారు. బ్యాంకులను రైతులు తీసుకున్న రుణ జాబితాకు ప్రభుత్వం చేసిన మాఫీ జాబితాకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు.చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని వారు అన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటే రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అలాగే పానుగల్ భీమా,కేఎల్‌ఐ కాల్వల ద్వారా చివరి ఆయకట్టు వరకు అన్ని గ్రామాలకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పానుగల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రు నాయక్,వీర సాగర్,సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, చిక్కేపల్లి నరసింహ,నాగేష్ నాయుడు,కరుణాకర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి ,బాలవర్ధన్,సుధాకర్ నాయక్,రాంబాబు నాయక్,ప్రవీణ్ రెడ్డి,తిరుపతయ్య,వెంకటయ్య,బిచ్చాలు,పరిస్థితుల్లో ఉన్నారు.