- ప్రథమ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులు
ముద్ర,పానుగల్ :- హైదరాబాదులో జరుగుతున్న 37వ నేషనల్ బుక్ ఫెయిర్ లో బాల సాహిత్యం పుస్తకం ప్రాధాన్యత అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలలో పానుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టీ.పల్లవి ప్రథమ బహుమతి, వీ. పల్లవి తృతీయ బహుమతులను సాధించారు.ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 నుంచి 29 వరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే 37వ జాతీయ పుస్తక ప్రదర్శనలో బాల సాహిత్యం అనే అంశం ప్రత్యేకించి ప్రదర్శించబడింది.ప్రముఖ బాలసాహితీవేత్త చొక్కారపు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 25 మంది పాఠశాల స్థాయి విద్యార్థులు నిర్వహించారు.
గెలుపొందిన విద్యార్థులందరికీ ప్రశంస పత్రంతో పాటు జ్ఞాపికను అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలసాహితీవేత్తలు పెందోట,నీరజ,చింతకుంట కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియా విశ్వవ్యాప్తమై ఎటు చూసినా మొబైల్ రాజ్యమేలుతున్న ఈ సాంకేతిక యుగంలో కూడా పుస్తకాలు ఆదరణకు నోచుకుంటున్నాయి. విశేష కృషి కొనసాగుతుందని ఇది మంచి పరిణామం అన్నారు. అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు పిల్లలకు సాహిత్యం పట్ల మక్కువ కలిగేలా చేయడం ఎంతో అవసరమన్నారు.
రేపటి సమాజం గొప్పగా పిల్లల పుస్తకాలతో అనుసంధానం కావాలంటే.పది రోజుల పుస్తక ప్రదర్శనలో ప్రతిరోజు ఒక సెషన్ బాల సాహిత్యం, దాని వ్యాప్తికి కార్యక్రమాలు కొనసాగించడం ఎంతో అభినందనీయం అన్నారు.ఒక పాఠశాల నుండి మూడు కవితల సంపుటాలు వెలువరించడం ఎంతో గొప్ప కృషి అని,కవితలు రాసిన పానుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ముఖ్య అతిథులు అభినందించారు.విద్యార్థులు తాము రాసిన కవిత సంపుటి పుస్తకాలను ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ సిబిఐ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ,ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ తదితర ప్రముఖులకు.ప్రతిభ చాటిన విద్యార్థులను మండల విద్యాధికారి శ్రీనివాసులు,పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.