ముద్ర, తెలంగాణ బ్యూరో : బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ సోమవారం నాడు అల్పపీడనంగా ఏర్పడే అవకాశం అన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో నాలుగు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.