Home తెలంగాణ రాజ్ భవన్ రహస్యం … రాష్ట్రంలో కీలక పరిణామాలకు అవకాశాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

రాజ్ భవన్ రహస్యం … రాష్ట్రంలో కీలక పరిణామాలకు అవకాశాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
రాజ్ భవన్ రహస్యం ... రాష్ట్రంలో కీలక పరిణామాలకు అవకాశాలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • గవర్నర్ భేటీ వెనక పెద్ద ప్లాన్
  • అరెస్టులే లక్ష్యంగా సీఎం యాక్షన్
  • ఇప్పటికే పవర్ ఫైనాన్స్ కమీషన్ నివేదిక
  • నివేదికలో కేసీఆర్ తప్పిదాలను ఎత్తి చూపించిన కమిషన్
  • కేటీఆర్ కు ఈ ఫార్ములా రేస్ ఉచ్చు
  • మరోవైపు కాళేశ్వరం కమీషన్ విచారణలో కేసీఆర్ పైనే టార్గెట్
  • ఇంజినీర్ల నుంచి కేసీఆర్ పేర్లను ప్రస్తావిస్తూ అఫిడవిట్లు
  • అరెస్టులు తప్పవంటూ ప్రభుత్వ వర్గాల లీకులు
  • కేసీఆరా.. కేటీఆరా..?
  • సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ తో చర్చలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలో అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై రాజకీయవర్గాల్లోనూ వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇందుకు రాజ్ భవన్ వేదికగా మారిందన్న గుసగుసలు సైత వినిపిస్తున్నాయి.

రాష్ట్ర గవర్నర్‌తో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కలవడం ఇందుకు ఊతమిస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ తో అరెస్టులపైనే వారు ప్రధానంగా చర్చించినట్లుగా ఉంది. ఈ కారణంగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో ఎవరో ఒకరు అరెస్టు కావడం ఖాయమన్న ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే గత రెండు మూడు రోజులుగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు…ప్రతి విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుండగా.. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు ఇబ్బంది తప్పదన్న చర్చ సాగుతోంది. దీంతో వారి అరెస్టులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ను అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు, మంత్రుల వ్యాఖ్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ చూస్తే కేసీఆర్ కుటుంబంలో అరెస్టులు ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సియోల్ పర్యటనలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ ముఖ్యనేతల అరెస్టులపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కక్కిస్తాం.. వాళ్లను జైళ్లలో పెడతాం.. అంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు అనేక సార్లు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇందిరమ్మ రాజ్యంలో తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టం.. అది చిన్న దొరనైనా, పెద్దదొరనైనా అని స్పష్టం చేశారు. ఇవే వ్యాఖ్యలు రెండు రోజుల క్రితం మంత్రి పొంగులేటి మరోసారి వ్యాఖాన వెనక….కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టుల వెనుక ఏదో కీలక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.

ఇటీవల పవర్ కమీషన్ సమర్పించిన నివేదికలో… గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇంకా కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమీషన్ విచారణ కూడా కేసీఆర్ చుట్టే జరిగింది. కేసీఆర్ సూచనల మేరకే డిజైన్ చేశామని ఇంజనీర్లు కమీషన్ చెప్పారు. కాగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు కూడా చేయలేదని వెల్లడైంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కేసీఆర్ కే చుట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇంకా ఫార్ములా-ఈ రేసులో కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి ఇప్పటికే గవర్నర్ అనుమతిని ఏసీబీ కోపడంతో ……కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైందన్న ప్రచారం సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.ఈ నేపథ్యంలో కేటీఆర్ సైతం తన మలేషియా పర్యటనను చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

కేసీఆరా? కేటీఆరా?

ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ పై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే…ఒకటి, రెండు రోజుల్లో ఆయన అరెస్ట్ ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ పై కేసు నమోదుకు ఏసీబీ ఇప్పటికే గవర్నర్ అనుమతిని కోరింది. అయితే కేసీఆర్ కు అయితే ఇప్పటికైతే ఎలాంటి అనుమతి అడగలేదు. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవినీతి కేసుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ అరెస్ట్ కాలేదు. దీంతో కేసీఆర్, కేటీఆర్ అయితే రాష్ట్రంలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి, మంత్రిగా ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

సెక్షన్ 17 ప్రకారం ఇలా చేయాల్సిందే..

కేసీఆర్ ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేటీఆర్ సిరిసిల్ల నుంచి నిర్వహిస్తున్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరిని అరెస్టు చేయాలన్నా ముందుగా స్పీకర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.'సెక్షన్‌ 17 ఏ' ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ విధులు నిర్వర్తించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునే సమయంలో జరిగిన అవకతవకలపై అరెస్ట్ చేయాలంటే గవర్నర్‌కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై కేసుకు సంబంధించి గవర్నర్ ను అనుమతి కోరింది. చంద్రబాబును ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో గవర్నర్‌కు సమాచారం అందించారు.

కేసీఆర్ మెడకు ఉచ్చుగా… విద్యుత్ కమిషన్ నివేదిక

యాదాద్రి, భద్రాద్రిలో సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ తీసుకోవడం, నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు ఇవ్వడం, ఇలా మొత్తం నాలుగు అంశాల్లో కేసీఆర్ సర్కార్ తప్పు చేసిందని, వీటికి మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత విద్యుత్ కమీషన్ నమోదు. ప్రధానంగా యాదాద్రి, భద్రాద్రిలో కాలం చెల్లిన క్రిటికల్ టెక్నాలజీ తీసుకోవడం అనేది తప్పు నిర్ణయమని స్పష్టం చేసింది.నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్టు ఇవ్వడం తప్పని, దీనివల్ల జరిగిన నష్టానికి అంచనా వేయాల్సి ఉంది. అయితే నిపుణుల కమిటీని వేయాలా, లేకపోతే ఇంకా ఏదైనా పద్ధతి ఉందా? లేదా? అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు కొనడంలో వెయ్యి మెగావాట్ల సరఫరాకు ఒప్పందం చేసుకొని రెండువేల మెగావాట్లకు కారిడార్‌ను తీసుకుంది. విద్యుత్తు సోర్స్‌ లేకుండా గ్రిడ్‌ బుక్‌ చేసింది కమీషన్ తప్పుపట్టింది. దీనివల్ల రూ.261 కోట్ల నష్టం వాటిల్లిందని కమీషన్ వ్యాఖ్యానించింది. ఇవి కేసీఆర్ మెడకు చుట్టుకోబోతున్నాయి. అందుకే ప్రభుత్వవర్గాల్లోనూ కేసీఆర్, కేటీఆర్ లో ఒకరు అరెస్టు కావడం తథ్యమన్న లీకులు వస్తున్నాయి. మొత్తానికి రెండు, మూడు రోజుల్లో పెను సంచనాలకు కేంద్రంగా మారబోతోందని.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech