Home సినిమా రష్మిక పెళ్లిపై నోరు జారిన అగ్ర నిర్మాత – Prajapalana News

రష్మిక పెళ్లిపై నోరు జారిన అగ్ర నిర్మాత – Prajapalana News

by Prajapalana
0 comments
రష్మిక పెళ్లిపై నోరు జారిన అగ్ర నిర్మాత


ప్రముఖ ఓటి మీడియా 'ఆహా' లో స్ట్రీమింగ్ అయ్యే బాలకృష్ణ(బాలకృష్ణ)వన్ మాన్ షో 'అన్ స్టాపబుల్'(UnStoppable)కి ఉన్న క్రేజ్.ప్రస్తుతం నాలగవ సీజన్ స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్ గా నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కి బాలయ్య అప్ కమింగ్ మూవీ 'డాకు మహారాజ్' టీం హోస్ట్ గా వచ్చింది.

ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ(నాగ వంశీ)తో బాలకృష్ణ మాట్లాడుతున్న హీరోయిన్ 'రష్మిక'(rashmika)పెళ్లి అనే టాక్ వస్తుంది కదా అని అడిగాడు.అందుకు నాగవంశీ మాట్లాడుతున్న తెలుగు హీరోతోనే పెళ్లి అంటున్నారు. కానీ ఆ హీరో ఎవరనేది చెప్పడం లేదని బదులిచ్చాడు.బాలయ్య అంతటితో ఆగకుండా ఆమె నీకు చెప్పడం లేదా కాస్త లీక్ చేయొచ్చు కదా అనగానే,ఆమె ఏం చెప్పలేదు.నాకు మాత్రం హీరో నుంచి హింట్స్ వస్తున్నాయని వంశీ చెప్పడం జరిగింది.ఆ వెంటనే వంశీ పక్కనే ఉన్న థమన్(తమన్)అంటే నీకు ఆ హీరో ఎవరో తెలుసా అన్నాడు. నాగవంశీ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీని నాగవంశీ నే అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.వీడీ 12 గా తెరకెక్కుతున్న ఈ మూవీకి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.

ఈ కారణంతోనే రష్మిక ప్రస్తావన అని నాగవంశీ దగ్గర బాలకృష్ణ తీసుకొచ్చినట్లుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.ఎందుకంటే రష్మిక, విజయ్ దేవరకొండ(vijay devarakonda)ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం.ఆ ఇద్దరు చాలా సందర్భాలలో లవ్ లో ఉన్నామనే విషయాన్నీ బహిరంగంగా చెప్పలేదు.ప్రస్తుతానికి అయితే మంచి స్నేహితులుగా ఉన్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఇద్దరు కలిసి అవుట్ ఆఫ్ కాంట్రీ వెళ్లారు.ఈ ప్రాసెస్‌లో ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఇద్దరు కలిసి ఫొటోలకి పోజులు కూడా ఇచ్చారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech