సౌత్ సినీ ఇండస్ట్రీలో తమిళ హీరో సూర్య(సూర్య)కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.శివపుత్రుడు,గజని,ఆరు,రక్తచరిత్ర పార్ట్ 1 ,పార్ట్ 2 ,సెవెంత్ సెన్స్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ,సింగం,ఆకాశమే నీ హద్దురా, జై భీం చిత్రాలతో సుదీర్ఘంగా సాగుతుంది కాలంగా తన అభిమానులతో పాటు ప్రేక్షకులని కూడా అలరిస్తూ వస్తున్నాడు.గత నెల నవంబర్ 14 న 'కంగువ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ చిత్రం విజయాన్ని అయితే అందుకోలేకపోయిందిగాని సూర్య నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
సూర్య కొన్ని రోజుల క్రితం తన కొత్త పొలాచ్చిలో ప్రారంభించాడు. సూర్య కెరీర్ లో నలభై ఐదవ చిత్రం తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆర్ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు.స్వతహాగా కామెడీ నటుడైన బాలాజీ గతంలో నయనతార(నయనతార)తో ముక్తి అమ్మన్ తో పాటు,వీట్ల విశేషం అనే చిత్రాలకి కూడా దర్శకత్వం వహించడం జరిగింది.దీంతో ఫస్ట్ టైం సూర్య లాంటి స్టార్ హీరోతో బాలాజీ సినిమా చేస్తున్నాడు మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.ఇక ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కబోయే మూవీ కథ,గతంలో రవితేజ(రవి తేజ)హీరోగా వచ్చిన 'వీర' అనే సినిమా కథకి దగ్గర పోలికలు ఉన్నాయానే వార్తలు సౌత్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.దీంతో సూర్య నలభై ఐదవ మూవీ ఫ్లాప్ మూవీ రీమేక్ కథనా అనే చర్చ సినీ ట్రేడ్ వర్గాల్లో కూడా జోరుగా జరుగుతుంది.మరి ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.
2011లో విడుదలైన 'వీర బాక్స్'(వీర)మూవీ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచారు.రవితేజ సరసన కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా శ్రీదేవి విజయ్ కుమార్,కిక్ శ్యామ్,రాహుల్ దేవ్, మురళి శర్మ ముఖ్యపాత్రలు పోషించారు. థమన్(థమన్)సంగీతాన్ని చేయడం జరిగింది.ఇక సూర్య తన నలభై నాలగవ కార్తీక్ సుబ్బరాజ్(karthik subbaraj)దర్శకత్వంలో చేస్తున్నాడు.పక్క యాక్షన్ టైనర్ గా ఆ చిత్రం రూపుదిద్దుకుంటుంది.