పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలైన విషయం తెలిసిందే.ఇక ఈ సంఘటనలో పోలీసులు ఇప్పటికే థియేటర్ ఓనర్, మేనేజర్,అల్లుఅర్జున్ కి చెందిన బౌన్సర్లని అరెస్ట్ చేయగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారు. అరెస్ట్ చెయ్యడం కూడా జరిగింది.పైగా రిమాండ్ కి కూడా తరలించే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఆర్ టి సి క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్న చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉండటంతో ఆయన్ని కలవడానికి అల్లు అర్జున్ మావ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(kancharla chandrasekhar reddy)రావడం జరిగింది.తొలుత స్టేషన్ లోపలకి చంద్రశేఖర్ రెడ్డి ని పోలీసులు అనుమతించలేదు.కానీ ఆ తర్వాత అనుమతించడం జరిగింది.ఇక ఈ కేసులో ఆయన కూడా న్యాయశాఖ సలహాలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.హైదరాబాద్ లో పలు రకాల విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.