92
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అత్రాస్లో మంగళవారం జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి107 మందికి పైగా మరణించారు మరో 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందింది. సంఘటన స్థలం స్థలానికి సమీపంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి అందుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కొద్ది మృతదేహాలను కమ్యూనిటీ సెంటర్ కు తరలిస్తున్నారు. అత్రాసులోని సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫుల్ రాయి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. బోలె బాబా అకా నారాయణ్ సర్కార్ హరి అనే స్థానిక బాబా గౌరవార్థం జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో దుర్ఘటన జరిగింది.