మాజీ బిగ్బాస్ నటి మీద దాడి చేయడంతో పాటు డబ్బుల్ని కాజేసిన యూట్యూబర్ హర్షసాయి(హర్ష సాయి)మీద కొన్ని రోజుల క్రితం పోలీసు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత యువతి ఈ విషయాన్నీ పోలీసులకి తెలియచేసింది.
దీంతో హర్షసాయి విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు.రెండు వారాలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న హర్షసాయి కి ఇప్పుడు ఈ నిర్ణయం షాక్ ని కలిగించడం గ్యారంటీ. ఇదిలా ఇప్పటికే హర్షసాయి తండ్రి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.దీని మీద కూడా తీర్పు రావాల్సి ఉంది.
ఇక హర్షసాయి వ్యవహారంపై బాధిత యువతీ లాయర్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్ష సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తు యువత పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ఎదురు తిరిగి హర్షసాయి మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.