ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)రష్మిక,(rashmika)సుకుమార్(sukumar)మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)కాంబోలో తెరకెక్కిన పుష్ప 2(pushpa 2)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే నాల్గవ తేదీ నుంచి ప్రీమియర్స్ షోస్ పడ్డాయో,యుఎస్ లో కూడా ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేయడం జరిగింది.
దీంతో ప్రీసెల్స్ తోనే పుష్ప ఏకంగా 3 .2 మిలియన్ డాలర్ మార్క్ గ్రాస్ ని అందుకుంది.ఇలా రిలీజ్ కి ముందే ప్రీ సేల్స్ లో పుష్ప 2 యుఎస్ లో 3.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటడం ఒక రికార్డు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ముందు పుష్ప 2 ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.ఇక ఈ రికార్డుపై పుష్పని వైఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రత్యంగిరా సినిమా అధికారకంగా ఒక పోస్టర్ రిలీజ్ కాకుండా బాక్స్ ఆఫీస్ కి కాపలా కాయండి. అల్లు అర్జున్ లాంటి శక్తి సరిహద్దుల్ని విచ్చినం చేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.