28
ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో సోమవారం యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు.
శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించారు.
గిరి ప్రదక్షిణ అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో ఉన్నారు. ఆయనకు అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు. అధికారులు ఆలయ లడ్డు ప్రసాదం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక వ్రత మండపం వద్ద మొక్కలు నాటారు. అనంతరం సైదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు.