కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)మనోజ్(manoj) మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఆస్తుల కోసం కాదని,ఆత్మగౌరవం గురించని మనోజ్ మొదటినుంచి చెప్తున్నా కూడా ఆస్తులు గురించే గొడవనే ప్రచారం తాజాగా తెర మీదకి వస్తుంది.దీంతో అసలు మోహన్ బాబు కి ఉన్న ఆస్తులు ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి ముగ్గురు పిల్లల్లో ఎవరెవరికి ఎంత ఇచ్చాడనే చర్చ జరుగుతుంది.
మోహన్ బాబుకి హైదరాబాద్ నగరంలో పలు ఏరియాల్లో ప్లాట్ లతో పాటు,ఫిలింనగర్ మెయిన్ రోడ్ పై ఒక ఇల్లు, జల్ పల్లిలో ఇప్పుడు మోహన్ బాబు ఉంటున్న ముప్పయి ఎకరాల్లోని ఫామ్ హౌస్, సొంతూరులో ఇల్లు,వ్యవసాయ భూమి,సినిమా పరిశ్రమకి సంబంధించి శ్రీలక్షిఫ్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ప్యాక్,మంచు ఎంటర్ టైన్ మెంట్ సంస్థలతో పాటు ఆస్తులు ఉన్నాయని అంటున్నారు.వీటన్నిటి విలువ సుమారు 600 వందల కోట్లపై మాటే అనే ప్రచారం చాలా ఎక్కువ జోరుగానే జరుగుతుంది.
ఇందులో ఫిలింనగర్ ఇంటిని లక్ష్మి(మంచు లక్ష్మి)పేరు మీద రాయగా, విష్ణు(విష్ణు)కి విద్యకేతన్ వ్యవహారాలతో పాటు 24 ఫ్రేమ్ నిర్మాణ బాధ్యతలని అప్పచెప్పడం జరగగా హైదరాబాద్‌లోని ఒక ఫ్లాట్‌ని మనోజ్‌కి హైదరాబాద్ ఇవ్వడం జరిగింది.కానీ ఇప్పుడుజల్ పల్లి ఫామ్ హౌస్ ని మనోజ్ చేస్తున్నాడని,కాకపోతే ఈ ఆస్తులన్నీ తను కూడా సంపాదించుకున్నవే కాబట్టి నేను ఎవరికి ఇస్తానో నా ఇష్టం అవసరమైతే దానం చేస్తానని కూడా మోహన్ బాబు అన్నట్టు సమాచారం.ఇక విష్ణుకి శ్రీ విద్యకేతన్ ని పూర్తిగా అప్పగించడంతో విద్యకేతన్ సిఐఓ వినయ్ మనోజ్ ని లెక్కచేయడం లేదని,ఆ విషయంలో కూడా మనోజ్ హార్ట్ అయ్యి గొడవకి దిగుతున్నాడనే మాటలు కూడా వినపడుతున్నాయి.