10
మోహన్ బాబు(mohan babu)మనోజ్(manoj)మధ్య జరుగుతున్న గొడవలో మీడియా ప్రవేశించడం, మీడియాని ఎప్పుడు గౌరవించే మోహన్ బాబు ఆవేశంతో ఒక జర్నలిస్ట్ ని మైక్ తో కొట్టడం తెలిసిన విషయమే.దీంతో మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని మీడియా సంఘాలు కోరగా పోలీసులు సెక్షన్ 118 కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసారు.
కానీ ఇప్పుడు పోలీసులు సెక్షన్ 118 నుంచి సెక్షన్ బిఎన్ఎస్ 109 కి.. దీంతో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదయినయ్యింది.లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు సెక్షన్ మార్చినట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.