30
ముద్ర,సెంట్రల్ డెస్క్:-ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకర డేట్, టైం ఫిక్స్ చేశారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7: 15 గంటలకు ఆ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పేజీకి ఎన్డీఏ పక్ష నేతలంతా హాజరుకానున్నారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే విదేశీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.