Home సినిమా మై డియర్‌ శ్రీతేజ్‌.. ఇప్పటికైనా నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు! – Prajapalana News

మై డియర్‌ శ్రీతేజ్‌.. ఇప్పటికైనా నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు! – Prajapalana News

by Prajapalana
0 comments
మై డియర్‌ శ్రీతేజ్‌.. ఇప్పటికైనా నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు!


ఒక సినిమా హీరో పట్ల నీకున్న పిచ్చి నీ తల్లిని బలిగొంది. రెండు వారాలుగా నిన్ను ఇలా మృత్యు కుహరంలో ఉంచింది. నువ్వు ప్రాణాపాయం లేదా, ఒకవేళ బయటపడినా ఆరోగ్యంతో అన్ని అవయవాలు పనిచేస్తూ నువ్వు మామూలువి అవుతావనిగానీ నీకు చికిత్స అందించిన ఖరీదైన డాక్టర్లు కూడా భరోసా ఇవ్వలేకపోతున్నారు. నీ పట్ల ఒక నిట్టూర్పును విడిచే ఖాళీ ఈ సంఘంలో మాతో సహా ఎవరికీ లేదు.

నీలాంటి సినిమా పిచ్చోళ్ళు, అభిమానులు వెర్రి ఎత్తినట్టు అక్కడ పోగుపడి పోవడానికి కారణమైన దైవాంశ సంభూతుడు అదే నీ హీరో ఈ కారణంగా (అతనే ప్రత్యక్షంగా మీ కుటుంబం ఈ స్థితికి కారణమని ఎవరైనా అనలేం, అది వేరే సంగతి) ఒక్కరోజు అరెస్ట్‌ అయి, రిమాండ్‌కు వెళితే ఆ ఒక్కరోజు ఆ కొద్ది గంటలు అతను ఆ జైలు గోడల మధ్య ఉన్నాడు. ఎలా కాలం గడపగలడోనని నిఖిల లోకం తలడిల్లిపోయింది. అంతెందుకు నీ తండ్రి కూడా అతని మీద పెట్టిన కేసులు వాపసు తీసుకుంటానని(చట్టపరంగా ఆ సాంకేతిక విషయాలు వేరే) టీవీ గొట్టాల ముందు నిలువెల్లా నీరైపోయి ఆవేదన చెందాడు.

నీ హీరో తాలూకు మామ ఆ శిబిరం మొత్తానికి మూలవిరాట్టు మెగాస్టార్‌ చిరంజీవి ఎక్కడో తన షూటింగును(జరుగుతోందా?) రద్దు చేసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. అల్లుడిని ఆగమేఘాల మీద ఎలా విడిపించుకు తేవాలా అని ఆగమైపోయాడు. అతని తల్లి అయితే ఆ కొద్దిగంటల ఆలస్యానికే పాపం తల్లడిల్లిపోయింది. తండ్రి నిజంగా అంతటి మహానటుడికి తండ్రిననిపించాడు. ఏ రకమైన ఇబ్బంది జరగదు, ఏదో ఒక పూట కొద్దిపాటి తాజాం తప్ప అనే భరోసా వాళ్లంతా ఎంత చలించిపోయారో, చలించి పోయినట్టు టీవీ తెరల ముందు కనిపించింది. కె. రాఘవేంద్రరావు ప్రభృత మహాదర్శకులు, స్టార్లు, సూపర్ స్టార్లు, ప్రిన్సులతో సహా నీ హీరో ఇంటి ముందు క్యూ కట్టారు, అతను ఎన్ని వేల టన్నుల ఎర్రచందనపు చెక్కల్ని తరలించుకుపోయినా కూడా పోలీసులకు చిక్కడనే భరోసా అతనికి లభించింది, ఆంధ్ర తెలంగాణలో పార్టీ అధినేతలంతా తమ ఆగ్రహాలతో (ట్విట్టర్‌) అకౌంట్ ఖాళీలు లేకుండా నింపేశారు.

అదీ ఒక సెలబ్రిటీ జీవితానికి, వాళ్ల కోసం పడిచచ్చే సామాన్య కీటకాల వంటి సాధారణ మానవ జీవితాలకి ఉన్న తేడా. మొదటి వారం రోజులు సినిమా టికెట్లు రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు అదేదో పవిత్ర కార్యంగా భావించి చేస్తున్నాయ్ అంటే వాటి పాలిట ప్రజ ఎంత నికృష్టమైందో చెప్పకనే చెబుతుంది. అల్లు అర్జున్ ఈ ప్రాణ నష్టానికి ప్రత్యక్షంగా కారకుడు కాదా అనేది ఎడ తెగని చర్చ. కానీ అతనికి కలిగిన, అంతటి విఐపి ప్రస్తుతానికి ప్రపంచం అంతా నీళ్లు తాగడం మానేసింది చూడండి అదీ ఇక్కడ సమాజ బానిసత్వపు ఛాయ. మేరా భారత్‌ మహాన్‌.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech