- రూ.24,269 కోట్లు విడుదలయ్యాయి
- ఆదేశాలు జారీ చేసిన ఆర్ధిక శాఖ
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణం మరో ముందడుగు పడింది. ఆ నిర్మాణ పనులకు సంబంధించి సర్కార్ శనివారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండో దశలో నిర్మించబోయే 76.4 కిలో మీటర్ల మార్గానికి రూ. 24,269 కోట్లు కేటాయిస్తూ జీవో.196 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశ నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వం, రాష్ట్ర వాటాగా రూ.7,313 కోట్లు, కేంద్రం వాటాగా 4,230 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపాయి. అలాగే జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ, న్యూడెవలప్ మెంట్ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకుల నుంచి 48 శాతం వాటాగా రూ.11,693 కోట్లు, పీపీపీ పద్దతిలో మరో రూ. 1,033 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో.
అలాగే మొదటి దశలో రూ.22,000 కోట్లతో 69 మెట్రో రైలు మార్గాన్ని నిర్మించామని, అది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలో నిర్మించిన అతి పెద్ద ప్రాజెక్టుగా తెలిపిన ప్రభుత్వం, రోజుకు 5 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నట్లు వివరించింది. మొదటి దశ విస్తరణతోపాటు రెండో దశ కార్యక్రమం చేపట్టే నగర విస్తరణ, ట్రాఫిక్ రద్దీపై సమగ్రంగా అధ్యయనం చేశాక మూడు కారిడార్లతో పాటు మరిన్ని కారిడార్లలో మెట్రో సేవలు అవసరమని ప్రభుత్వం గుర్తించినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉద్ఘాటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలో మీటర్ల మార్గానికి సంబంధించిన సర్వేకు అనుగూణంగా మెట్రో రైలు దశ కారిడార్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, రెండో దశలో మొత్తం 116.4 మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దాన కిశోర్ వివరించారు.
అయితే అందులో మొదటగా పార్ట్ ఏ కింద 76.4 పారిశ్రామిక మార్గానికి పరిపాలన అనుమతులు ఇచ్చామని, పార్ట్-బిలో నిర్మించనున్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలో మీటర్ల మార్గానికి సర్వే జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కారిడార్ 4లో నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ- కోకాపేట నియోపోలీస్ వరకు 11.6 కిలో మీటర్లు, కారిడార్ 6లో ఎంజీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి 7.5 కిలో మీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ త్నగర్ వరకు 7.1 కిలో మీటర్లు నిర్మించినట్లు తెలిపిన సర్కార్, మెట్రో రైలు రెండో దశ పార్ట్-బిగా కారిడార్ 9లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. దీనితో మెట్రో రెండో దశ పనులకు ఉన్న అడ్డంకులు తొలిగినట్లయింది.