ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రివర్గంలో చేరికకు సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. వీరిద్దరూ చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగానే మెగా బ్రదర్ నాగబాబు మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు కొద్దిరోజులు కిందట సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. నాగబాబు ప్రమాణస్వీకార తేదీని ఖరారు చేయడంపైన ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలను చర్చించిన తర్వాత మంచి రోజు చూసుకుని ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు తెలియజేసినట్లు చెబుతున్నారు. సంక్రాంతి తరువాత ప్రమాణస్వీకారం కోసం నాగబాబు ఆసక్తిగా చూపుతున్నారు. ఇదే పరిశీలన సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత తన సోదరుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేసినట్లు తెలిపారు. కొద్దిరోజుల కింద ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక నాగబాబుకు ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఈ మూడు స్థానాల్లో రెండు స్థానాలను టిడిపి దక్కించుకోగా ఒకదానికి బిజెపికి కేటాయించారు. జనసేనకు రావాల్సిన సీటును త్యాగం చేసిన నేపథ్యంలోనే మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రివర్గంలో కల్పించినట్లు ప్రచారం. అందుకు అనుగుణంగానే రాజ్యసభ అభ్యర్థుల పేర్లతో పాటుగా అధినేత సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ప్రకటనలో మెగా బ్రదర్ నాగబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటనకు అనుగుణంగానే తాజాగా మంత్రివర్గంలో తన బ్రదర్ నాగబాబు పేరుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబు చర్చించారు. సంక్రాంతి పండుగ తర్వాత మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునేలా చర్యలు తీసుకునేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ మేరకు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆయన సూచించినట్లుగా ఉంది.
అలాగే వైసిపి నుంచి కూటమి పార్టీలోకి చేరికలపైన ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీలోని కీలక నేతలు టిడిపి, జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలను పార్టీలో చేర్చుకున్నారు. మరి కొంతమంది గ్రీన్ సిగ్నల్ కోసం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య చేరికలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చేరికలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గత వైసిపి హయాంలో అవినీతికి పాల్పడిన నేతలను, ఇష్టం వచ్చినట్టుగా చెబుతున్న దుర్భాషలాడిన నాయకులను చేరికలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ తరహా నేతలను పార్టీలో చేర్చుకోవడం వల్ల క్యాడర్‌లో అసంతృప్తి పెరుగుతుందని, ఇది భవిష్యత్తులో ఇబ్బందులకు కారణమవుతుందని ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొద్ది రోజులు పాటు చేరికలకు దూరంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. రాజకీయ స్వలాభం కోసం పార్టీ మారే వారిని తీసుకోవడం వల్ల కూటమి పార్టీలో అంతర్గత లుకలుకలు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చేరికలకు మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని.
శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొంటే ప్రమాదమా.. ప్రముఖ ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే..
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..