- ఇక్కడ ఇల్లు.. అక్కడ ఇంటి స్థలం
- మూసీని ఖాళీ చేసి వెళ్లండి
- మూసీ నిర్వాసితుల కోసం మరో ప్లాన్
- ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 గజాల ఇంటి స్థలం
- ఔటర్ రింగు రోడ్డు లోపలే స్థలాలు
- కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం
ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గని రేవంత్ సర్కారు.. నిర్వాసితుల కోసం మరో ఆఫర్‌ను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఇంటి కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మూసీ పునరుజ్జీవంలో భాగంగా పరిహక ప్రాంతంలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే అనేక నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలిసింది. 26న జరిగే కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రక్షాళన చేసి తీరాల్సిందే
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహించే మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మూసీ పునరుజ్జీవనం పేరుతో గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మూసీ పరివాహకప్రాంతాల్లోని అక్రమణలను తొలగిస్తోంది. రివర్ బెడ్ ప్రాంతంలోని ఇండ్లను కూల్చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మూసీ నిర్వాహిసుతులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తోంది. ఇప్పటికే మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించారు. రూ.25వేల చొప్పున నగదు, ఉపాధి కోసం రూ.2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తోంది.
ఆమోదంతోనే తరలిద్దాం
మూసీ నిర్వాసితులను ఒప్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. కూల్చివేతలకు బుల్డోజర్లు వెళ్లేలోగా.. స్వచ్ఛందంగా ఖాళీ చేయించేందుకు నానా ఆఫర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. మూసీ బాధితులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. రింగ్ ఔట్ రోడ్డు వెంట నిర్వాసితులకు ఇండ్ల జాగాలు అందించిన రేవంత్ సర్కార్ కోరింది. ఈ నెల 26న కేబినెట్ భేటీలో మూసీ నిర్వాసితులకు ఇండ్ల జాగాలు ఇచ్చే విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 చదరపు గజాల చొప్పున ప్లాట్ అందజేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయా ప్లాట్ల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నారు.
భూమి ఉందా..?
మూసీ పరివాహక ప్రాతంలోని రివర్బెడ్, బఫర్ జోన్లలో ఉన్న నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఈ ఇండ్ల జాగాలను అందించారు. హైదరాబాద్ నగరం నాలుగు వైపులా ఔటర్రింగ్ రోడ్డు లోపలే వారికి ఇండ్ల జాగాలు అందుబాటులో ఉన్నాయని యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, మూసీ నిర్వాసితులు దాదాపు 13 వేలకు పైగానే ఉంటారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి 150 నుంచి -200 చదరపు గజాల చొప్పున అందజేసినా ముత్తం 600 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ భూములను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకేచోట కాకుండా.. నాలుగు వైపులా ఈ భూమిని తీసుకోనున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భూమి ఉండగా.. దానికి అనుగుణంగా ప్రైవేట్‌గా భూమిని కొనుగోలు చేయాలని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నెల 26న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక ఒక్కో ప్లాట్ విలువ రూ.25 నుంచి -30 లక్షల వరకు ఉండటంతో.. నిర్వాసితులు మూసీ వీడేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు, ప్రభుత్వం కోరుతోంది.