ముద్ర.వీపనగండ్ల :- అప్పుచేసి ఆరు కాలం కష్టపడి పండించే పంటలు వర్షాల వల్ల పాడవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వివిధ గ్రామాలలో కూరగాయల తోటలకు భారీ వాటిలాగా, మండలంలో భీమా కోత గురికావడంతో సుమారు 70 ఎకరాల వరి పంటలలో ఇసుక మేటలు వేయడంతో రైతులకు నష్టం వాటిల్లింది. వీపనగండ్ల గ్రామానికి చెందిన పెబ్బేటి మహేష్, శ్రీకాంత్ ఇద్దరు రైతులు గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి ఎకరాకు పదివేల చొప్పున ఏడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మునగ తోటను సాగు చేస్తున్నారు. గత వారం రోజుల వరకు మునుగతోటతో మరో రెండు నెలలు కష్టపడితే మునగ తోట నుంచి మంచి లాభాలు అర్జించవచ్చు.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మునుగతోట పై పెట్టుకున్న అతడి ఆశలు అడియాశలు అయ్యాయి. భారీ వర్షాల వల్ల మరో ప్రాంతం నుంచి వర్షపు నీళ్ళు మునుగ తోటలో చేరడంతో మునగ తోట కుళ్ళిపోయి పనికి రాకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఏడెకరాలలో సాగుచేసిన మునుగతోటకు ఇప్పటికే రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు పెబ్బేటి మహేష్, శ్రీకాంత్ తెలిపారు. మునగ తోటలో నీళ్ళు నిల్వ ఉండటంతో జెసిబి తో కాలువలు తీయించి బయటకు తోడటం ప్రారంభించింది, పొలంలో నీళ్లు చేరడం వల్ల మోకాళ్ళ లోతుకు గురవుతున్నాయని, పరిస్థితి ఇదే విధంగా ఉంటే మరింత నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. వ్యవసాయ అధికారులు పా మునుగ తోటను పరిశీలించి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్న రైతులు.