45
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- అధికారులు స్పందించారు.. సమస్యను పరిష్కరించారు. భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు మురుగునీరుతో అవస్థలు తప్పడం లేదు. దీంతో ఈ నెల 2న మురుగుతో చిన్నారుల అవస్థలు అనే కథనం ముద్ర దినపత్రికలో ప్రచురితమైంది.
అధికారులు స్పందించి అంగన్‌వాడి కేంద్రానికి అనుకొని ఉన్న మురుగునీరును తొలగించారు. అనంతరం దోమలు వ్యాపించకుండా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు. ముద్రణ పత్రిక చొరవతో మురుగు సమస్యను పరిష్కరించి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రచురించిన ముద్రణ దినపత్రికకు అనేక కృతజ్ఞతలు తెలిపారు.