- నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్
- పలువురికి గాయాలు
- పోలీసులపైకి చెప్పులు, కూర్చీలు విసిరిన నిరసనకారులు
- సికింద్రాబాద్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- లాఠీ ఛార్జ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం
ముద్ర, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా శనివారం నాడు సికింద్రాబాద్ వ్యాప్తంగా బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వీహెచ్‌తో పాటు పలు హిందూ సంఘాల కార్యకర్తలు, స్థానికులు కలిసి ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీని పోలీసులు అడ్డుకుని నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై నిరసనకారులు బైఠాయించారు. డీసీపీ రష్మీ పెరుమాల్ ఆందోళనకారులకు నచ్చజెప్పినా వినలేదు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు, కూర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. ఈ పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. పోలీసులు జరిపిన లాఠీచార్జ్‌లో ఆందోళనకారుల్లో కొందరి శరీరభాగాలకు గాయాలయ్యాయి. తన ఎడమ చెయ్యి విరిగిందంటూ ఓ యువకుడు నేలపై కూలబడ్డాడు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సికింద్రాబాద్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరొపక్క హిందూ సంస్థల పిలుపుమేరకు సికింద్రబాద్ వ్యాప్తంగా బంద్ జరిగింది. వర్తకులు వ్యాపార సంస్థలను మూసివేశారు. ఆర్టీసీలు సైతం నిలిపివేయగా, ప్రైవేటు వాహనాలు మాత్రమే ఒకటీ బస్సులు తిరుగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే అల్పా హోటల్, ప్యారడైజ్ హోటల్ కూడా మూతపడ్డాయి.
లాఠీ ఛార్జ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం
ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. మతపరమైన మనోభావాలపై దాడి జరిగినప్పుడు, విగ్రహాలను అపవిత్రం చేసినప్పుడు శాంతియుతంగా నిరసన చేయడానికి కూడా అనుమతి లేదు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ లాఠీఛార్జ్‌కు ఎవరు పట్టుకున్నారు.? ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప న్యాయం కోరే భక్తులపై కాదని అన్నారు. తమ మత విశ్వాసంపై జరిగిన ఈ దాడికి జవాబుదారీతనం, న్యాయాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.