Home తెలంగాణ ముగ్గురు పండితులకు శ్రీ భాష్యకార పురస్కారాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ముగ్గురు పండితులకు శ్రీ భాష్యకార పురస్కారాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ముగ్గురు పండితులకు శ్రీ భాష్యకార పురస్కారాలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • శ్రీ రామానుజ సేవా ట్రస్ట్
  • ఆధ్వర్యంలో సన్మానోత్సవం

ముద్రణ తెలంగాణ బ్యూరో, హైదరాబాద్: వ్యాసపౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ రామానుజ సేవాట్రస్టు సంకల్పించిన ఆచార్య సన్మానోత్సవం బుధవారం నాడు వైభవంగా జరిగింది.

వేద విద్యా వాచస్పతులయిన ముగ్గురు మహా పండితులను శ్రీ రామానుజ సేవాట్రస్టు తరపున 'శ్రీ భాష్యకార' పురస్కారంతో సన్మానించారు. సంప్రదాయ మార్గనిర్దేశకులు అయిన మహామహోపాధ్యాయ డా. సముద్రాల రంగ రామానుజాచార్యస్వామి సన్మానించారు. డా. విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనాపాటి, ఉ. వే. డా. అప్పన్ కందాడై పెరుమాళ్లాచార్య స్వామి, డా. దోర్బల ప్రభాకరశర్మకు 'శ్రీ భాష్యకార' పురస్కారాలను డా. రంగరామానుజాచార్యస్వామి ప్రదానం చేశారు.

ముగ్గురు విద్వాంసుల ఆర్ష సంప్రదాయ నేపథ్యం గురించి ఆయన అద్భుతంగా వివరించారు.

పురస్కార గ్రహీతలు శ్రీ రామానుజ సేవా ట్రస్టు సేవానిరతిని, సంప్రదాయ కార్యక్రమాల నిర్వహణ స్ఫూర్తిని ప్రశంసిస్తూ, శ్రీరంగనాథుని సన్నిధిలో పురస్కారాలు స్వీకరించడం తమ భాగ్య విశేషమన్నారు.

ఈ సన్మాన వైదిక వాగ్మయ పరిరక్షకులు, వేదగణిత విశారదులు డా. రేమెళ్ల అవధాని, అలాగే దర్శనం శర్మ, మరుమాముల దత్తాత్రేయ శర్మ, శింగనభట్ల నర్సయ్య వంటి ఆర్షధర్మ పరిరక్షకులు.

ఈ సందర్భంలోనే హైకోర్టు అడ్వకేట్, సంప్రదాయ కవి శ్రీ అనంత్ కృష్ణ 'వదలకుమా నాచేయి వాసుదేవ' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

చివరలో గురువరేణ్యులందరితో కలిసి ఎన్ ఎఫ్ సి కూడలిలోని శ్రీ భగవద్రామానుజుల విగ్రహాన్ని సందర్శించి, పూమాల సమర్పించారు. తొలి ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు అందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech