Home తెలంగాణ మాతా శిశు మరణాలపై ప్రభుత్వం అమానవీయంగా కనిపిస్తోంది – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

మాతా శిశు మరణాలపై ప్రభుత్వం అమానవీయంగా కనిపిస్తోంది – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
రాజీనామా కాదు.. రాజకీయ సన్యాసం చేస్తా - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • సమస్య పరిష్కారంపై దృష్టి సారించకుండా..ప్రతిపక్షాలపై బురద జల్లుతోంది
  • సీనియర్ డాక్టర్లను బదలీ చేయడం వల్లే ఈ సమస్య
  • మాపై విమర్శలను మానుకుని…ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి
  • పార్టీ తరపున ఒక నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తాం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఆసుపత్రిలో కొనసాగుతున్న మాతా శిశు మరణాల పైన భారత రాష్ట్ర సమితి ఒక నిజ నిర్ధారణ (ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని) ఏర్పాటు చేసింది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఏర్పాటు చేయనున్న ఈ నిపుణుల కమిటీ గాంధీలో జరుగుతున్న మరణాలపై అధ్యయనం చేసి, గుర్తించిన అంశాలను ప్రభుత్వంతోపాటు ప్రజలతోనూ పంచుకుంటామన్నారు. పార్టీలు చేసే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం కలిసి రావాలని ప్రజల ఆరోగ్యాలను బాగుపరిచేందుకు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు సూచనలను స్వీకరించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలపై దృష్టి సారించాల్సింది పోయి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన తమ పార్టీపైన ఎదురుదాడికి దిగడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టాల్సింది పోయి దానిని పక్కదారి పట్టించేటటువంటి ఇప్ప‌టికైనా మ‌ర‌ణాల‌పై రివ్యూ చేశారా…? నాణ్యమైన వైద్యం ఫోకస్ చేశారా… లేదా? మొన్న‌టి బ‌దిలీల్లో సీనియ‌ర్ డాక్ట‌ర్ల‌ను బదిలీపై పంపార‌న్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఉందా… లేదా? అనే ప్రశ్నలకు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన డాక్టర్లను బదిలీ చేయడం వలన అక్కడ చికిత్సలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుందని గుర్తించబడింది.దీని అరికట్టి మరణాలను తగ్గించే ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు.

వైద్యం అందటం లేదు… పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహప్రభో అంటే బుదరాజ్‌ల్ల ఉన్నట్లు మాట్లాడతారా? అన్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయల’నుకుంటే… హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మిస్తున్న పెద్దాసుపత్రులు, వ రంగ ల్ లో నిర్మాణం జరుగుతున్న అతిపెద్ద ఆసుప త్రి, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్ లు ఏర్పాటు చేస్తారా? కేసీఆర్ కిట్లు, తల్లి-బిడ్డను ఇంటి దగ్గెర దిగబెట్టేలా వాహనాలు, సాదారణ ప్ర‌స‌వాలు జ‌రిగేలా చార్య‌లు తీసుకోవ‌టం, రెండు ప్ర‌భుత్వ‌మెడిక‌ల్ కాలేజీలు ఉన్న చోట 33మెడిక‌ల్ కాలేజీల ఏర్పాట్లు జ‌రిగేవా? అని కెటిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మాపై ఎదురుదాడి త‌ర్వాత‌ ముందుగా మీ పాల‌న‌లో ఉన్న లోపాలు స‌రిదిద్దుకోవాలని కెటిఆర్‌ సూచించారు. పోయిన ప్రాణాలు తిరిగి రావు… ఆ త‌ల్లుల క‌డుపుకోత తీర్చ‌లేమ‌నే సోయితో ఆలోచించి, ప్ర‌జ‌లు కూడా మ‌న బిడ్డ‌లే అని మాన‌వ‌త్వంతో ఆలోచిస్తే మీ పాల‌న తీరు కూడా మారుతుందని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలు ఒక సంఖ్యగా మాత్రమే కనిపించడం దారుణమని అది ఒక కుటుంబానికి సంబంధించిన శిశువు లేదా తల్లి మరణం అనే మానవీయమైన కోణంలో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న మరణాలు ఒక కుటుంబ భవిష్యత్తు అనే కనీస సొయి ఈ ప్రభుత్వానికి లేదని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech