Home తెలంగాణ మాజీ సర్పంచుల పోరుబాట..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

మాజీ సర్పంచుల పోరుబాట..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
మాజీ సర్పంచుల పోరుబాట..! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన ఉధృతం
  • ఛలో హైదరాబాద్‌ను భగ్నం చేసిన పోలీసులు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి మాజీ సర్పంచుల అరెస్టులు
  • తప్పించుకుని నగరానికి చేరుకున్నారు
  • సీఎం ను కలిసి వినతి పత్రం నిర్ణయం
  • జూబ్లీహిల్స్‌లో పల్లె మాజీ ప్రథమ పౌరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు
  • రాష్ట్ర సర్కార్ తీరుపై పెల్లుబికుతున్న ఆగ్రహం
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో.. రూ. 1500 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మాజీ సర్పంచులు ఆందోళనబాట పట్టారు. 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ (వారి పదవీ కాలం ముగిసే) వరకు గ్రామాల్లో తాము చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. బిల్లుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై ఇప్పటికే పలు దఫాలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు నిరసనలకు దిగిన మాజీ సర్పంచులు తాజాగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. పల్లెల్లో అభివృద్ధి పనుల కోసం గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో శ్మశానవాటికలు, ప్రాంగణాలు, డంపింగ్ యార్డులు వంటి అనేక పనులు చేసిన మాజీ సర్పంచుల బిల్లుల కోసం ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. అయినా ఇంత వరకు బిల్లుల కోసం ఆర్థిక ఇబ్బందులు వీరందరూ రాష్ట్ర సర్కార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలలో రూ.1500కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండగా వాటిని వెంటనే విడుదల చేయాల్సిన అవసరం లేదని గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

తాజాగా మొన్నటి వరకు పెండింగ్ బిల్లుల కోసం మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ, ప్రకటన రాలేదు. దీనితో వారి ఆందోళనను రాజధానికి షిఫ్ట్ చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆదివారం అర్థరాత్రే ఎక్కడికక్కడ మాజీ సర్పంచులను వారి గ్రామాల్లోనే ముందస్తుగా అరెస్ట్ చేయడం రాజకీయాలను హీటెక్కించింది. అయినా ఏలాగోల పోలీసుల నుంచి తప్పించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు సర్పంచులు జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు.

తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం అందించాలని నిర్ణయించుకోగా వారిని పోలీసులు అరెస్టు చేసి వివిధ స్టేషన్‌లకు వచ్చారు. ఈ సందర్భంగా రెడ్డి మాజీ సర్పంచులు మాట్లాడుతూ రేవంత్ సీఎం అయిన తర్వాత గ్రామపంచాయతీలు అద్వానంగా మారాయని. పంచాయతీలకు కాంగ్రెస్ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ బిల్లులు అడిగేందుకు హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ఆదివారం సర్పంచ్ అడ్డుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా మాజీలను వెళ్లకుండా అర్థరాత్రి పోలీసులు నిర్బంధించడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం బిల్లులను విడుదల చేయని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేశాయి.

ఇది అసలు సమస్య..!

గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పాలనలో అప్పటి సీఎం, ప్రభుత్వం వెల్లడించడంతో ఆర్థిక ఇబ్బందులున్నా సర్పంచులు అప్పులు కేసీఆర్‌ తీసుకొచ్చి మరీ గ్రామాల్లో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, శ్మశానక, నర్సరీ, మిషన్‌ భగీరథ, ఎన్‌ఆర్‌ఐజీఎస్‌ పనులు, డంప్‌ యార్డ్‌, పల్లె ప్రకృతి వనాలు నిర్మించారు. 2018 డిసెంబర్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. అభివృద్ధి పనులన్నీ సర్పంచులకే అప్పగించడంతో డబ్బులు మిగులుతాయనే ఆశతో సర్పంచులందరూ పోటీపడి మరీ పనులు పూర్తి చేశారు. 2019 నుంచి నవంబర్ 30, 2023 (అసెంబ్లీ ఎన్నికల) వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ. 1500 కోట్ల మేర అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఇప్పటికే ఎన్నికలు రావడంతో బిల్లులకు బ్రేక్ పడింది.

ఆ ఎన్నికల్లో అనూహ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఆ పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఫోకస్ చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపు కుదరదనే విధంగా ఉంది. దీంతో కాంగ్రెస్‌ అధికారంలో పది నెలల్లో ఇప్పటికే పలుమార్లు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలు, నిరసనలు తెలిపిన మాజీ సర్పంచులు సెప్టెంబర్‌లో రాష్ట్ర సచివాలయంలో ముట్టడికి విఫలయత్నం చేశారు. ఆ సమయంలో పెండింగ్ బిల్లులు ఇవ్వడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, మంత్రులు హామీ కూడా ఇచ్చారు. అయినా ఇంత వకు ఆ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మాజీలు ఇక ఉధృత ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇదిలావుంటే.. గత హయాంలో చేసిన అప్పుల ప్రభుత్వ వడ్డీ భారాన్ని మోయలేకపోతున్న సర్పంచులకు ప్రస్తుతం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది.

భారమవుతోన్న ప్రత్యేక పాలన..!

ప్రత్యేక పాలనలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నలిగిపోతున్నారు. జనవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో పాలన సాగిస్తోంది. పంచాయతీ కార్యదర్శుల రోజు వారి పనులు ఒకవైపు పంచాయతీ నిర్వహణ మరొకవైపు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేక గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇటు ప్రత్యేకాధికారులు సైతం తమ తమ కార్యాలయాల్లోనే ఉంటూ సంతకాలకే పరిమితమయ్యారు. ప్రత్యేక అధికారులకు తమ రోజు వారి బాధ్యతలతో పాటు పంచాయతీ నిర్వహ హణ బాధ్యతలు అప్పగించడంతో వారు అటువైపు చూసే సమయం లేకుండా పోయింది. దీంతో పంచాయతీ కార్యదర్శులపై అధిక భారం పడుతుండడంతో వారు సతమతమవుతున్నారు.

గ్రామపంచాయతీలలో సర్పంచులు లేకపోవడం చేత నిర్వాహణ భారం పంచాయతీ కార్య దర్శులు పడుతుండడంతో వారు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.గ్రామపంచాయతీ సాధారణ పరిపాలనలో శానిటేషన్‌, పారిశుభ్రత, వీధిలైట్లు, పంపిణీతోపాటు అడ్మినిస్ట్రేషన్‌ స్థాయిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో సర్ఫికెట్లు, పల్లెల్లో ప్రగతి భవనాలు, బిల్, , పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, నర్సరీ, మిషన్‌ భగీరథ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, డంపింగ్‌ యార్డ్‌, పల్లె ప్రకృతి వనానికి సంబంధించిన ఫొటోలు ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం యాప్‌లో అప్‌లోడ్ చేయడం వంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దీనికి తోడు ప్రత్యేక పాలనలో అధిక భారం పడింది. గ్రామస్థాయిలో వీఆర్‌వోలు లేక ఆధార్‌ వ్యవస్థలకు సంబంధించిన పనులు, అంగన్‌వాడీ, హెల్త్‌, విద్యుత్‌ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులను పంచాయతీ కార్యదర్శులకు పురమాయిస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech