29
ముద్ర ప్రతినిధి, నిర్మల్: సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో డి శ్రీనివాస్ పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పీసీసీ అధ్యక్షులు, మంత్రిగా తెలుగు ప్రజలకు డీఎస్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన డీ శ్రీనివాస్ అంచెలంచెలుగా జాతీయస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.