సూపర్ స్టార్ మహేష్ బాబు(మహేష్ బాబు)దర్శక ధీరుడు రాజమౌళి(రాజమౌళి)కాంబోలో తెరకెక్కబోతున్న మూవీకి సంబంధించిన పనులన్నీ చకచకా జరుగుతున్నాయి.ఒక పక్క ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు లొకేషన్స్ సెర్చ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ బిగింగ్ లో మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎన్నో హిట్ చిత్రాలను అందించిన కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో ఈ మూవీని నిర్మించగా,విజయేంద్ర ప్రసాద్ కథని అందించారు.
ఇప్పుడు ఈ మూవీ గురించి ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(తమ్మారెడ్డి భరద్వాజ్)మాట్లాడిన ఇంటర్నేషనల్ యాక్టర్స్ మహేష్, రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు.దీంతో సినిమా బడ్జట్ వెయ్యి కోట్లు దాటవచ్చు.బిజినెస్ కూడా అంతకు మించి రెండు వేల కోట్ల రూపాయలను దాటి రాజమౌళి టీం ఆశిస్తున్నారు.ఈ నంబర్ మూడు, నాలుగువేల కోట్లు. వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అదే జరిగితే భారతీయ సినీ రంగంలోనే ఆ మూవీ ఒక చరిత్ర అవుతుంది. భవిష్యత్తుని ముందుగానే ఊహించడంలో రాజమౌళి మంచి నేర్పరి.
బాహుబలి తర్వాత వచ్చిన వంద కోట్లు,ఆర్ ఆర్ ఆర్ తో 300 కోట్లు అంటే చాలా చిన్న సినిమా లెక్క అయిపోయింది.రేపు మహేష్ మూవీ వచ్చాక 500 కోట్ల బడ్జట్ సినిమా వచ్చిందని చెప్పుకొచ్చాడు.ప్రేజంట్ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.మహేష్ అభిమానులు అయితే కామెంట్స్ ని నెట్టింట షేర్ చేస్తున్నారు. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.