టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోల్లో సినిమాల ద్వారా కాకుండా అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న ఏకైక హీరో మహేష్. సినిమాలతోపాటు పలు రకాల వ్యాపారాలు, కమర్షియల్ యాడ్స్ ద్వారా అధిక మొత్తంలో సంపాదిస్తారు మహేష్. అంతేకాదు, పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఇప్పటికే ఆపదలో ఉన్న ఎంతో మందిని తమ ఫౌండేషన్ ద్వారా ఆదుకున్నారు, ఆర్థిక సాయం చేశారు. బిజినెస్ వ్యవహారాలు, ఫౌండేషన్‌కి సంబంధించిన పనులు, కొత్త వ్యాపారాల ప్రణాళికలు ప్రస్తుతం ఆయన సతీమణి నమ్రత చూస్తారు.
సినిమాలు, యాడ్స్ కాకుండా ప్రొడక్షన్ హౌస్, ఎంబి సినిమాస్, రియల్ ఎస్టేట్ సంస్థల్లో వాటాలు, రెయిన్బో హాస్పిటల్స్, జ్యూయలరీ షోరూమ్స్‌లో మహేష్‌కి వాటాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మహేష్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పుడు సోలార్ ఎనర్జీపై దృష్టి పెట్టారు. మొత్తం మహేష్ భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు. ఈ రంగంలో ప్రముఖంగా చెప్పుకునే ట్రూజన్ సోలార్ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని, మహేష్ అందులో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టబోతున్నారని సమాచారం.
ఇక మహేష్’ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం లాక్ అయి ఉన్నారు. సినిమాలోని క్యారెక్టర్‌కి తగినట్టుగా తన గెటప్‌ని పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటివరకు మహేష్ ఏ సినిమాలోనూ ఈ గెటప్‌తో కనిపించలేదు. ఫస్ట్‌టైమ్ ఈ తరహా లుక్‌లో కనిపిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఏళ్ళ తరబడి ఆ కాంపౌండ్లోనే ఉండాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. దానికే ఫిక్స్ అయిన మహేష్ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందా అని కనిపించారు. ఫారెస్ట్ అడ్వంచరస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి ఆల్రెడీ దక్షిణాఫ్రికా వెళ్లి లొకేషన్స్‌ను ఫైనల్ చేసుకున్నారు. మొదట ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ, ఇప్పుడు ఈ ఏడాది చివరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.