గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అనేక హామీలను ఇచ్చారు. అందులో కీలకమైన హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం. అనుకున్నట్టుగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొన్ని హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.. ఇప్పటికే అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అనుగుణంగా ప్రభుత్వం వెళుతుంది. ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ చైర్మన్ గా, హోం మంత్రి శాఖ మంత్రి, మహిళ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. రవాణా రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మంత్రుల కమిటీ ఉంటుంది.
అక్కడ ఈ పథకం అమలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులు, అక్కడ అనుసరిస్తున్న విధానాలు వంటి వాటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్రంలో ఈ అమలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను గురించి వివరిస్తుంది. ఈ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ నిర్ధరణ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా ఈ సంక్రాంతి పండగ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం వీటిపై ఎలా ముందుకు వెళ్లాలని నిర్ధారించేందుకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన ప్రభుత్వం ఈ పనిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఎలా ఉంటే రాష్ట్రంలో రెండువేల ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులను కొద్ది రోజుల్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసేందుకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయగలిగాడు. ఈ సర్వీసులో అందుబాటులోకి వస్తే మరింత మెరుగైన సేవలను పొందే అవకాశం ఉంటుంది.
నాటి వీరనారీల స్ఫూర్తితో ముందుకు.. దుర్గా వాహిని సభలో వక్తల సందేశం
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..