ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చీఫ్ వార్డెన్ పై ఆరోపణలు చేస్తూ వెలువడ్డ కరపత్రం దరిమిలా చీఫ్ వార్డెన్ కు మద్దతు తెలుపుతూ శుక్రవారం రాత్రి ట్రిపుల్ ఐటీ తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ సాలిడారిటీ. (టిఎస్ఎస్ ) సంఘం అధ్యక్షుని పేరుతో పత్రిక ప్రకటన విడుదల చేయబడింది. చీఫ్ వార్డెన్ గా శ్రీధర్ పనిచేస్తున్నప్పటినుంచి కేర్ టేకర్లను ఎక్కువ సంఖ్యలో నియమించాలని రాతపూర్వకంగా తెలిపి, ఎవరు పట్టించుకోలేదని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తొమ్మిది వేల మంది విద్యార్థులకు కేవలం నలుగురు కేర్ టేకర్లు మాత్రమే ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ తనిఖీల్లో కూడా తేలిందని వారు పేర్కొన్నారు. వీసీ ఈ పక్కదారి పట్టించడానికి చీఫ్ వార్డెన్ పై కావాలని నిందలు మోపబడి వారు ఆ ప్రకటనలో ఉన్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న ఘటనలు నియంత్రణ, పర్యవేక్షణలోపం వల్లే జరుగుతున్నాయని వారు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. చీఫ్ వార్డెన్ అందించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలి.