19
- చేపల పెంపకం కోసం తెలంగాణ ప్రభుత్వ స్టడీ టూర్
- రాష్ట్ర ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతికి రేవంత్ సర్కార్ ముందడుగు వేసిందని తెలంగాణ ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మెట్టు సాయి కుమార్ మాట్లాడారు.. చేపల పెంపకం, విక్రయాల అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం స్టడీ టూర్ చేపట్టారు.
ఈనెల 11వ తేదీ నుంచి 13 వరకు బెంగుళూరు, మైసూర్‌లోని మూడు రోజుల క్షేత్రస్థాయి పర్యటనను తెలంగాణ మత్స్యశాఖ అధికారులు చేస్తారన్నారు. గత పదేండ్లలో చేపల పెంపకం పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోపిడి చేశారు. పలు రాష్ట్రాల్లో అనంతరం రాష్ట్రంలో నూతన మత్స్యపాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తోంది.