ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనికరెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'నారి'. మహిళలను గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు సూర్య వంటిపల్లి వారిని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'నారి' సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 'మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు. అయినా వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళల అనే నిజాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలి. మహిళల్ని గౌరవించాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్‌తో నారి సినిమా చేసిన సూర్య వంటిపల్లిగారికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నారి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. మహిళల గురించి వారి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు.
దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ 'ఈరోజు మా నారి సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్కగారికి కృతజ్ఞతలు. వారు ఎంతో ఉన్నా మా మూవీ కాన్సెప్ట్ విని టైం ఇచ్చారు. ఇటీవల ఓ స్కూల్లోని అమ్మాయి తన టీచర్‌తో అమ్మాయిగా తన కష్టాలు చెబుతూ తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఆ సన్నివేశం మా నారి సినిమాలోనిది. ఆ అమ్మాయి నిత్యశ్రీ. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాను. డిసెంబర్ 25న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి మహిళ తమ ఇంట్లోని పురుషుడిని తీసుకెళ్లి ఈ సినిమాను చూపిస్తారని కోరుకుంటున్నాను' అన్నారు.