Home తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావువి ఉత్తర ప్రగల్భాలు … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

మంత్రి జూపల్లి కృష్ణారావువి ఉత్తర ప్రగల్భాలు … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
మంత్రి జూపల్లి కృష్ణారావువి ఉత్తర ప్రగల్భాలు ... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • యాసంగికి సాగునీళ్ళు లేవు అనడం ప్రభుత్వ అసమర్థత
  • పాలమూరు..రంగారెడ్డిని వెంటనే పూర్తి చేయాలి
  • మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ముద్రణ ప్రతినిధి, వనపర్తి : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కె.సి.ఆర్ది అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి నియోజకవర్గాన్ని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 90 శాతం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసినా 10 శాతం పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వం రేవంత్ రెడ్డి అని గుర్తించబడింది.

సాగునీరు, రుణమాఫీ కోసం, రైతు భరోసా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని అన్నారు.

రికార్డ్ స్థాయిలో 35 రోజుల పాటు ఏడతెరిపిలేని వర్షాలు పడి పై నుండి వరద రావడం వల్ల దాదాపు 25,30టి ఎం సిల నీళ్ళు సముద్రం పాలు అయ్యా అన్నారు. నీళ్లు ఎలా ఒడిసి పట్టుకోవాలి అని తెలియదు, ఏరిగేషన్ బోర్డ్ సమావేశం పెట్టకుండా ఒక డిప్యుటీ తో ప్రకటన ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. జూరాల లో నీళ్లు లేవు కాబట్టి యాసంగీకి నీళ్ళు ఇవ్వలేమని, రామన్ పాడు వరకు నీళ్లు ఇస్తామని చెబుతున్నారని, జూరాల నుంచి కొడనగల్ కు ఎత్తిపోతల పథకం వెస్ట్ అనడం ఆలోచన రహితం అని మాజీ నిరంజన్ రెడ్డి అన్నారు. కె సి ఆర్ మొదలు పెట్టిన పని నుండి నీళ్లు ఇస్తే పేరు వస్తుందనే పట్టుదల అవసరం లేదని, ప్రజల పక్షాన ఆలోచన చేయండి అని అన్నారు. కె.సి.ఆర్ అంచనా ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా

బీమా ద్వారా 2 లక్షలు, కోయిల సాగర్ ద్వారా 40 వేలు కొడంగల్ లిఫ్ట్ కాకుండా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వొచ్చు అని అన్నారు. ప్రభుత్వ అసమర్తవల్ల ఈ వరద నీళ్లు లేకపోతే యాసంగికి నీళ్లు ఉండవు అని.పక్క నియోజకవర్గం లో ఫోటోలు పెట్టుకునే సంబరం తప్ప జూపల్లికి ప్రజలకు మంచి ఆలోచన చేయాలన్న సోయి లేదు అన్నారు.

ఉత్తమ్ కుమార్ ఉత్తి మాటలు అని గతంలో జూపల్లియే చెప్పాడని, 1984 నుండి 2004 కల్వకుర్తి పథకం మీద కేవలం 12 కోట్లు ఖర్చు పెట్టానని, బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 100 సార్లు మాట్లాడానని, .కె.సి.ఆర్, హరీష్ రావు వల్లనే ఎన్నో కల్వకుర్తి పోతుల పథకం పూర్తి చేసి నీళ్లు ఇచ్చారని అన్నారు. సార్లు జూపల్లి చెప్పాడని ఇప్పుడు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

బిఆర్ ఎస్ పార్టీలో ఉండి మంత్రి పదవులు అనుభవించినప్పుడు తెలియదా అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి మంత్రి పదవి వచ్చిన తరువాత ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు అని చెప్పడానికి సిగ్గు అనిపించలేదా… అని ఆయన ఘాటుగా స్పందించారా. 2016లో అప్పటి నీటి పారుదల శాఖమంత్రి హరీష్ రావు వచ్చినప్పుడు అప్పటి మంత్రి జూపల్లి మాట్లాడిన వీడియో నిరంజన్ రెడ్డి చూశారు. గత ప్రభుత్వం హయాంలో పాలమూర్ పంటలకు నీళ్లు అందకపోవడంతో పంటలు పండక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

20 ఏండ్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న మీరు జొన్నలగడ్డ రిజర్వాయర్ వద్ద అప్పటి మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియోతో అది గత పాలకులు నీళ్లు ఇవ్వలేదు అని చెబుతున్నారు కదా, గత ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టిన మీరు అసమర్తులు అన్నట్లా అని ఎద్దేవా చేశారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 2014 కన్నా ముందు కేవలం 4 టి ఎం సి లు ఇచ్చారని, అదే కె సి ఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత సంవత్సరానికి 40 టి ఎం సి ల నీళ్లను ఎత్తిపోయడం జరిగింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని, పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేశాము అన్నది ముఖ్యం అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో వనపర్తి నియోజకవర్గం లేక పోయిన ఒప్పించి నీళ్ళు తెచ్చామని అన్నారు. గొంతులు తెగిన పరవాలేదు అని, తెలంగాణ కోసం కొట్లాడినం అని, చోట మోట నాయకులు మాట్లాడితే ఎక్కడ ఎవరు బెదరరు అని అన్నారు. కె ఎల్ ఐ కింద అదనపు రిజర్వాయర్ మీద దృష్టి పెట్టండి అని, పాలమూర్ రంగారెడ్డి ను నీటి పారుదల శాఖ మంత్రి సందర్శించకుండా ఎదో మాట్లాడతారు అని అన్నారు.

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బిఆర్ ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ బిఆర్ ఎస్ ఎందులో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యేలు అందరు కలిసి పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టన్నెల్, రిజర్వాయర్లను పరిశీలించి, ఎం చేస్తే ప్రజలకు నీళ్లు ఎలా అందించాలో అడగకుండా నీళ్లు అడిగితే బట్టలు ఊడగొడుతాం అన్నారు. పాలన చేస్తున్నారా లేక రౌడీ ఐజం చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ఆదాయం ఎంత, అప్పు ఎంత అని వనరులు ఎట్లా పెంచుకోవాలని చూసుకున్నాక ఎన్నికల హామీలు ఇవ్వాలిఅని, నోటికి వచ్చినట్లు హామీలు ఇవ్వకూడదని హితవు పలికారు. ఈ సమావేశములో బి.లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, కృష్ణా నాయక్, ఎద్దులకరుణశ్రీ, వనం రాములు, విజయ్ కుమార్, పృథ్విరాజ్, జనాధం నాయుడు, తిరుపతయ్య, బాలరాజు, నందిమల్ల అశోక్, మాణిక్యం, చంద్రశేఖర్ నాయక్, జాత్రూ నాయక్, రాజశేఖర్, దిలీప్ రెడ్డి, మతీన్, మతీన్, చిట్యాల రాము, సునీల్ వాల్మీకి, రమేష్, మంద రాము నిర్వహించారు వరకు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech