- ప్రభుత్వ భూముల వెంచర్లకు దారులు….
ముద్ర, ఆలేరు : తమ భూముల వ్యాపారం కోసం ప్రభుత్వ భూములను సైతం వదలకుండా భూ వ్యాపారులు రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ కొలనుపాక గ్రామ రాజకీయాల పరిధిని పెద్ద వాగులో నుండి భూ వ్యాపారులు దారి ఏర్పాటు చేసి తమ వ్యాపారాన్ని యదేచ్చగా కొనసాగించడానికి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు సహకరిస్తూ, తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సాకుతోరియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తున్నారు. నిజానికి తమ వ్యవసాయ భూముల దగ్గరకు రాకపోకలు కొనసాగాలంటే పది పీట్ల రోడ్డు అవసరం, కానీ రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి ముడుపులు పుచ్చుకున్న నేతలు 30 ఫీట్ల రోడ్డు ఏర్పాటుకు సహకరించడం గమనార్వహం. మరో సంస్థకు ప్రభుత్వం నుండి భూమిలోనుండి సదరు వ్యక్తి దారి ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.
రామాజీపేట గ్రామం లోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 73 నుండి వెంచర్ నిర్వహకులు దారిని ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారం కొనసాగించడాన్ని గుర్తించిన గ్రామంలోని మక్కల దుర్గయ్య అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వారు పట్టుకున్న జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో లోకాయుక్త ఆశ్రయించారు. ఆ వెంచర్ నిర్వాహకుల కోసం గ్రామానికి చెందిన తమ వ్యవసాయ భూములకు వెళ్లడానికి దారి అవసరమని దుర్గయ్య రైతులకు కేవలం 10 పిట్ల రోడ్డు సరిపోతుంది అని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పది పీట్ల రోడ్డును వదిలి మిగిలిన రోడ్డును రెవిన్యూ అధికారులు తొలగించాల్సిందిగా అధికారులు స్పందించి ఆ స్థలంలో కొంత రోడ్డును తొలగించారు భూమి అని బోర్డును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దుర్గయ్య 10 పిట్ల రోడ్డుకు పర్మిషన్ ఎలా జరిగిందో దానిని రద్దు చేయడం జరిగింది సంబంధిత అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు కలిసి వారి దృష్టికి తీసుకెళ్లారు, వారు దాటవేత ధోరణితో పరోక్షంగా వెంచర్ నిర్వాహకులు సహకరించారు.
ప్రభుత్వ భూమిగా ఉన్న బోర్డును శనివారం నాడు గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూముల నుండి దారులు ఏర్పాటు చేసుకొని అనేక వెంచర్ నిర్వాహకులు తమ వ్యాపారాలను యదేచ్చగా కొనసాగిస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు నిలదీస్తున్నారు. మక్కల దుర్గ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సైతం అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిలో వేసిన బోర్ను సీజ్ చేసి తన పలుకుబడితో ఆ భూమిలో నేటికీ సేద్యం చేస్తూనే ఉన్నారు. అనేక విషయాలలో కబ్జాదారులకు వ్యతిరేకంగా చట్టపరంగా పోరాడుతున్న మక్కల దుర్గయ్యపై ముసుగులు ధరించిన వ్యక్తులు హత్యాయత్నం కూడా జరగడం. అధికారులు స్పందించి, ప్రభుత్వ భూముల నుండి వెంటనే దారులు ఏర్పాటు చేసుకొని భూ వ్యాపారాలు సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామపంచాయతీ అనుమతితో గతంలో వెంచర్లు చేసి ఆ విక్రయించిన నిర్వాహకులు ప్రస్తుతం డిటిసిపి లేఅవుట్ పేరుతో మరోసారి నూతన అనుమతులు పొంది, గతంలో కొనుగోలు చేసిన వారికి శఠగోపం పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆలేరు మండలం రాఘవపురం గ్రామ పరిధిలో గతంలో విజయవాడకు చెందిన వజ్జె రజని గ్రామపంచాయతీ అనుమతితో ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లాట్ లను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు విక్రయించారు. తిరిగి ఆ భూమిని గ్రామానికి చెందిన కొంతమంది కొత్త కంపెనీ బోర్డును ఏర్పాటు చేశారు. గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులు తమ స్థలం ఉందని సదర్ వ్యక్తుల దృష్టికి తీసుకెళ్లేందుకు అనుమతించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కాయ కష్టం చేసి తమ కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులతో ప్లాట్లను కొనుగోలు చేస్తే, అక్రమ భూ వ్యాపారులు ఆ స్థలాలను ఎక్కువ మందికి విక్రయించి నిధులను కొనుగోలు చేసి గుర్తించలేని స్థితిలో కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారు.
గతంలో గ్రామపంచాయతీ అనుమతులతో వెంచర్లను ఏర్పాటు చేసి, తిరిగి ఆసుపత్రుల్లో నూతన అనుమతుల కోసం వచ్చిన నిర్వాహకులకు ఎలాంటి అనుమతుల విషయంలో అధికారులు ఇవ్వద్దని ప్రజలు కోరుతున్నారు. యాదగిరి గుట్ట వారి పెద్దకందుకూర్ గ్రామంలో సన్ సిటి వెంచర్ నిర్వహకులు హద్దులను దాటి గతంలోని రొడ్డును ఆక్రమించుకొని వెంచర్ ప్లాట్లను విక్రయిస్తున్నారు. చిన్నకందుకూర్ స్టేజి సమీపంలో ఉన్న సన్ సిటి వెంచర్ నిర్వాహకులు నక్ష బాటను ఆక్రమించి వెంచర్ ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్రమైన జరిపి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.