- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పలు శాఖల అధికారులతో కలిసి నియోజకవర్గంలోని పలు చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే
- వరద నీటితో పొంగిపొర్రుతున్న చెరువులు కుంటల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే
- గ్రామీణ ప్రాంతాలు తాండాలలో వైద్యాధికారులు విషజ్వరాలు ప్రబలకుండా చూడాలని ఆదేశించిన ఎమ్మెల్యే
- వెంపటి గ్రామంలో భారీ వర్షాలకు కూలిన ఇండ్లు
- వరద ప్రవాహాల్లో ముందుకు తగు చర్యలు తీసుకున్న తుంగతుర్తి సీఐ, ఎస్ఐలు
తుంగతుర్తి ముద్ర:- గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఎట్టకేలకు ఆదివారం రాత్రి నుంచి కొంతమేర తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు .తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు కుంటలు వాగులు, వంకలు వరద నీటి ప్రవాహాలుగా కనిపించాయి. నిండుకుండల్లా మారి ప్రమాదపు అంచులకు చేరుకున్న పలు చెరువులను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పరిశీలించారు. పసునూరు గ్రామంలో వరద నీటితో నిండిన చెరువును పరిశీలించి చెరువుకు ప్రమాదం కలగకుండా చూడాలని అధికారులను పరిశీలించారు .
అదేవిధంగా నియోజకవర్గంలోని అతిపెద్ద చెరువు అయిన రుద్రమ చెరువు అలుగు పోస్తున్న తీరుకు అటు రైతులు శాసనసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు .వర్షం వల్ల వెంపటి గ్రామంలో పలువురి ఇల్లు కూలడం తో బాధితులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొత్తగూడెం గ్రామంలో వరద నీటితో నిండి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో గండి పడే అవకాశం ఉండటంతో స్పందించిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలు సిఐ శ్రీను నాయక్ ప్రజలతో కలిసి ప్రజలను అప్రమత్తం చేసి అలుగు వద్ద కొంతమేర తొలగించడంతో చెరువుకు ముప్పు తప్పింది. అలాగే అన్ని గ్రామాల చెరువుల స్థితిగతులను అధికారులు తెలుసుకుంటూ అప్రమత్తమయ్యారు.
తుంగతుర్తి పోలీస్ అధికారులు పొంగిపొర్లుతున్న వాగులు వంకల వద్ద ప్రజల వాగులకు వెళ్లకుండా వాహనాలను అడ్డంపెట్టి తగు చర్యలు చేపట్టారు. పోలీసు అధికారులు వరద విషయంలో అప్రమత్తమయ్యారు .సుమారు దశాబ్దన్నర క్రితం ఇలాంటి వర్షాలు కురిశాయని తిరిగి ఇప్పుడే చూస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఒకేరోజు ఒకేసారి సుమారు 500 చెరువులు అలుగులు పోయడం నియోజకవర్గం ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవులు ప్రజలను అప్రమత్తం చేశారు .భారీ వర్షాలతో ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లాలని సూచించారు. వరద ప్రవాహాలలో ఉన్న ప్రాంతాల ప్రజలు ఈ ఎమ్మెల్యేగా ఉన్నారని పేర్కొన్నారు.సంఘటనలో వైద్యాధికారులను అప్రమత్తంగా ఉండాలని గ్రామీణ ప్రాంతాలు తండాలలో ప్రారంభమై విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని సూచించారు.ఏది ఏమైనా కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండడంతో యావత్ ప్రజలు రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.