యూట్యూబ్‌లో ఎంతో పాపులర్ అయిన హర్షసాయిపై బిగ్‌బాస్ ఫేమ్ మిత్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను ఉద్దేశించి వేధించాడని, రేప్ చేశాడని ఆ ఫిర్యాదులో గుర్తించారు. దీంతో హర్షసాయిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మిత్రశర్మ తాజాగా ఆర్.జె. శేఖర్‌బాషాపై కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్. ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఆఫీస్‌లోనే ఉన్నారు శేఖర్ బాషా. పోలీసులు అతన్ని మూడు గంటలుగా విచారిస్తున్నారు. మిత్రశర్మపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు శేఖర్ భాషపై బాధితురాలు ఫిర్యాదు చేసింది.
హర్షసాయి విషయానికి వస్తే.. తనను రేప్ చేయడమే కాకుండా నగ్నవీడియోలు తనను బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదులో మిత్రశర్మ గుర్తించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నప్పటికీ హర్షసాయిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతను ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. అతను పరారీలో ఉన్నాడని. ఈలోగా యూట్యూబర్లచేత మిత్రశర్మపై దుష్ప్రచారం చేయిస్తున్నాడనే ఆరోపణలు కూడా హర్షసాయిదాలుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ తాజా సీజన్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శేఖర్ బాషా కొద్దిరోజుల్లోనే బయటకు వచ్చేయడం గమనించాల్సిన విషయం.