10
హైదరాబాద్ డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో వేసిన ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉండటం అందరికీ తెలిసిందే. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అల్లు అర్జున్ అని పలు సంఘాలు ఆరోపించడమే కాకుండా అతనిపై కేసు కూడా పెట్టారు. అతన్ని వెంటనే అరెస్ట్ చెయ్యాలంటూ ఎంతో మంది డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.