Home సినిమా 'బ్యాక్‌ టు ది బీట్స్‌'.. ఫుల్‌యాక్‌, బిగ్‌ అప్‌డేట్‌తో జానీమాస్టర్‌ రెడీ! – Prajapalana News

'బ్యాక్‌ టు ది బీట్స్‌'.. ఫుల్‌యాక్‌, బిగ్‌ అప్‌డేట్‌తో జానీమాస్టర్‌ రెడీ! – Prajapalana News

by Prajapalana
0 comments
'బ్యాక్‌ టు ది బీట్స్‌'.. ఫుల్‌యాక్‌, బిగ్‌ అప్‌డేట్‌తో జానీమాస్టర్‌ రెడీ!


జానీ మాస్టర్‌… తను డాన్స్‌ కంపోజ్‌ చేసిన పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అంతలోనే అతని జీవితాన్ని చీకటి కమ్మేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అవార్డును వెనక్కి లాగేసింది. జాతీయ అవార్డు అందుకోవడానికి అతను అనర్హుడని తేల్చింది ప్రభుత్వం. మధ్యంతర బెయిల్ కూడా రద్దయింది. అప్పటివరకు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా మాయమైపోయి ఆ స్థానంలో అత్యాచార ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలలపాటు జైలులోనే మగ్గిన తర్వాత ఇప్పుడు సాధారణ బెయిల్‌పై బయటికి వచ్చాడు జానీ మాస్టర్‌. తిరిగి తన దైనందిన జీవితానికి శ్రీకారం చుట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు ఓ వీడియోను కూడా షేర్ చేయండి.

'బ్యాక్‌ టు డైట్‌ బీట్స్‌ ఇన్‌ ఫుల్‌ వాల్యూమ్‌.. బిగ్‌ అప్‌డేట్స్‌ లోడిరగ్‌' అంటూ ట్వీట్‌ చేసిన జానీ మాస్టర్‌ తన ఇంటి నుంచి డాన్స్‌ స్టూడియోకి వెళ్లడం, అక్కడ తన సహచరులను కలుసుకోవడం వంటి విజువల్స్‌తో ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. కొరియోగ్రాఫర్‌గా మళ్ళీ ప్రాక్టీస్ ప్రారంభించి తన ప్రొఫెషన్‌లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈసారి తను ఫుల్‌ వాల్యూమ్‌తో వస్తున్నట్టు ట్వీట్ చేశాడు. అంతేకాదు, బిగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయి అంటూ హింట్ ఇచ్చాడు. తమ దగ్గర టాలెంట్ ఉంటే పోయిన అవకాశాలు కూడా మళ్ళీ వెతుక్కుంటూ వస్తాయని చాలా సందర్భాలలో, చాలామంది విషయంలో రుజువైంది. ఇప్పుడు తనకి కూడా సినిమాలు వస్తాయన్న కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నాడు జానీ మాస్టర్.

త్వరలోనే బిగ్ అప్‌డేట్స్ ఇస్తాను అని ట్వీట్ చేశాడంటే.. తప్పకుండా మళ్ళీ పెద్ద సినిమాలతోనే కమ్ బ్యాక్ అవుతున్నాడని అర్థమవుతోంది. టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోలందరికీ పాటలు చేశాడు జానీ. అలాగే తమిళ్‌ హీరోలతో కూడా స్టెప్పులు వేయించాడు. మరి ఇప్పుడు అతని కమ్ బ్యాక్‌కి వెల్కమ్ చెప్పబోతున్న మొదటి హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతే జానీ మాస్టర్‌ అలా ట్వీట్ చేశాడని కొందరంటున్నారు. ఏది ఏమైనా జానీ మళ్ళీ తన పనిలో బిజీ అయిపోయాడు. మరి అతను చేయబోయే సినిమాలు ఏమిటో తెలియాలంటే ప్రస్తుతం ఆగాల్సిందే.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech