ముద్ర ప్రతినిధి, భువనగిరి :ఆర్థికాభివృద్ధికి, వ్యవసాయ రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ బ్యాంకర్లు పకడ్బందీగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే బ్యాంకర్ల ప్రతినిధులకు సూచించారు.
గురువారం కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ శాఖ, వివిధ సంఘాల ప్రతినిధులు, కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లకు రుణమాఫీ అమలుపై అవగాహన కల్పించేందుకు ఆయన హాజరైన ప్రభుత్వం వ్యవసాయ రంగం బలోపేతానికి, రైతుల ఆర్దిక వికాసానికి అధికారులు వెన్నుదన్నుగా 2 లక్షల రూపాయల రుణ మాఫీ ప్రకటించారు, అందులో భాగంగా గురువారం సాయంత్రం 4.00 గంటలకు విడుతగా ఒక లక్ష రూపాయాల వరకు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
తేది.12-12- 2018 తేదీన లేదా ఆ తరువాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు తేది. 09-12-2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రైతులకు రుణ భారం కాకూదని, ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చే అధిక ప్రాధాన్యతే రుణ మాఫీ కార్యక్రమమని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, ఇతర రుణాలకు రుణమాఫీ వర్తించదని, అర్పులైన రైతులందరికీ రుణ మాఫీ వర్తింపజేయాలని సూచించారు. ప్రతి బ్యాంకు ఒక నోడల్ అధికారిని నియమించి రైతులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేయాలని, రుణమాఫీని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా ఉండి సలహాలు అందించి రుణమాఫీ పథకంలో అర్హత ప్రతి రైతు లబ్దికి చర్యలు తీసుకుంటున్నారు.
రుణమాఫీకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 08685293312 ఫోన్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ప్రవీణ్, వ్యవసాయ అధికారులు.