28
బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ నగర పాలకసంస్థ మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేట్ ని మేయర్ ఛాంబర్ లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గంలో ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిశోర్ గౌడ్ ఉన్నారు. మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన అజయ్ కుమార్ యాదవ్ ను కార్పొరేషన్ కమిషనర్ జి.రామలింగం, మేనేజర్ నాగేంద్రబాబు, ఇతర అధికారులు, సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛాలు అందించడంతో పాటు, శాలువాలతో సత్కరించారు.