- బొగ్గు గనుల వేలం పాటను నిలుపుదల చెయ్యాలి
- సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్
ముద్ర,పానుగల్:-బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అప్పగించాలని, బొగ్గు గనుల వేలం పాటను నిలుపుదల చేయాలని కోరుతూ పానుగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ మాట్లాడుతూ దేశంలో 500 మంది బొగ్గు గనులు ఇప్పటికే 300 బొగ్గు గనులను ప్రైవేటుగా అందిస్తున్నాయి. సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టారని నేడు 67 బొగ్గు గనులను వేలంపాట ద్వారా ప్రైవేట్ కంపెనీ పెట్టుబడిదారులకు వేలం పాట ద్వారా అప్పగించేందుకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలు చేశారు.
బొగ్గు గనులను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టడాన్ని పదో విడత వేలం ప్రక్రియ మొదలు పెట్టారని రాష్ట్రానికి చెందిన జి కిషన్ రెడ్డి కేంద్ర గనుల శాఖ మంత్రి పదవి చేపట్టడం ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం చేయబోతున్నారని తెలిపారు. కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.వనపర్తి కూటమి జిల్లా జూన్ 28వ తేదీన నిరసన చేపడుతున్నందున ప్రజలు జయప్రదం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు భగత్, జి వెంకటయ్య, జంబులయ్య, నరసింహ, మన్యం, యాదగిరి నాగేష్ కురుమయ్య నిర్వహించారు.