27
మాజీ ఎంపీటీసీ మద్యం షాపులో ఆకస్మిక దాడి..
తుర్కపల్లి, ముద్ర :మండలంలోని దత్తాయ పల్లి గ్రామంలో బెల్టు షాపులపై గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు మాజీ ఎంపీటీసీ కొండం రఘురాములు మద్యం షాపులో ఆకస్మిక దాడి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షాపు దారులు ఇకనైనా మానుకోవాలని లేదంటే ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.